ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రైతుల మేలు కోసమే రుణమాఫీ

ABN, Publish Date - Jul 31 , 2024 | 12:08 AM

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి రైతు మేలు కోరుతూ రుణమాఫీ పథకా న్ని అమలుచేస్తోందని కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే అన్నారు. మం గళవారం రెండో విడత రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం సందర్భంగా కలెక్టరేట్‌లో నిర్వహించి న కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

రూ.165.87కోట్లతో 16,143మంది రైతులకు లబ్ధి

కలెక్టర్‌

భువనగిరి అర్బన్‌, జూలై 30: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి రైతు మేలు కోరుతూ రుణమాఫీ పథకా న్ని అమలుచేస్తోందని కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే అన్నారు. మం గళవారం రెండో విడత రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం సందర్భంగా కలెక్టరేట్‌లో నిర్వహించి న కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రుణమాఫీ పథకం 2018 డిసెంబ రు 12 నుంచి 2023 డిసెంబరు 9 వరకు రుణాలు తీసుకున్న రైతుల రూ.2లక్షలు మాఫీ అవుతాయన్నారు. ఈ నెల 18న తొలి విడత రుణమాఫీ కింద రూ.1లక్ష వరకు జిల్లాలో 36,483మంది రైతులకు రూ.199.87కోట్లు మాఫీ అయ్యాయన్నారు.రెండో విడత 16,143మంది రైతులకు రూ.16 5.87కోట్లు మాఫీ అవుతాయన్నారు. ప్రస్తుత పంట సీజన్‌లో రైతులకు విత్తనాలు, పెట్టుబడికి ఇది ఉపయోగపడుతుందన్నారు. రుణమాఫీ విషయంలో ఏదైనా సమస్యలు ఉంటే టోల్‌ఫ్రీ నంబరు 08685-293312లో సంప్రదించాలని కోరారు. ప్రతీ క్లస్టర్‌ పరిధి రైతు వేదికల్లో ఆధార్‌ వివరాలతో వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదిస్తే వారు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్నారు. బ్యాంకర్లు రుణమాఫీ ప్రక్రియలో కీలకపాత్ర పోషించాలని, రుణమాఫీలో రైతులకు లబ్ధి చే కూరేలా చూడాలని సూచించారు. అంతకు ముందు హైదరాబాద్‌ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన సందేశాన్ని వీక్షించారు. రైతులు శ్రీశైలం, మంగమ్మ, మల్లేశం, శ్రీహరి, సావిత్రికి రుణమాఫీ చెక్కుల ను కలెక్టర్‌ అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి అనురాధ, ఏరువాక శాస్త్రవేత్త అనిల్‌కుమార్‌, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ శివరామకృష్ణ, సహకార అధికారి నాగమణి, తదితరులు పాల్గొన్నారు.

మహిళల ఆర్థికాభివృద్ధికే ‘మహిళా శక్తి’ : కలెక్టర్‌

మహిళల ఆర్థికాభివృద్ధికే ‘మహిళా శక్తి’ పథకమని, జిల్లాలో ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలని కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ‘మహిళా శక్తి’ పథకంపై సంబంధిత శాఖల సమన్వయ సమావేశంలో ప్రణాళిక రూపకల్పన, అమలును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలను ఆర్థిక శక్తిమంతులను చేయడమే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా సూక్ష్మ పరిశ్రమలు, వ్యాపారులను ప్రోత్సహిస్తామన్నారు. ఉత్పత్తికి అవసరమయ్యే ఆర్థిక సహకారం కోసం బ్యాంకు లింకేజీ సదుపాయం ఉందన్నారు. ముడి సరుకులు, మార్కెటింగ్‌కు అవసరమైన ప్రణాళిక, సహకారం అందివ్వడం మహిళా శక్తి పథకంలో భాగమన్నారు. మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌, పర్మినెంట్‌ స్టిచ్చింగ్‌ కేంద్రాలు, పాడి గేదెల పెంపకం, మొబైల్‌ ఫిష్‌ అవుట్‌లెట్‌, పాల డైరీలు, మీ-సేవ కేంద్రాలు, మహిళా శక్తి క్యాంటీన్లు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, వ్యవసాయ అనుబంధ పరికరాలు, ఈవెంట్‌ మేనెజ్‌మెంట్‌ తదితర 14రకాల జీవనోపాధులు ఈ పథకంలో భాగమన్నారు. జిల్లాలో 2024-25 సంవత్సరానికి 12,451యూనిట్లు మంజూరు చేయాలన్నారు. బ్యాంకులు ముందుగానే కావాల్సిన డాక్యుమెంట్ల చెక్‌లిస్ట్‌ ఆయా గ్రూపులకు అందించి రుణ సదుపాయం సులభతరం చేయాలన్నారు. అందుకు సంబంధిత శాఖలు డీపీఆర్‌ తయారు చేయాలన్నారు. కొన్ని మోడల్‌ పైలెట్‌ ప్రాజెక్టులను ప్రారంభించి, యూనిట్ల నిర్వహణ, మార్కెటింగ్‌ అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ కే.గంగాధర్‌, డీఆర్డీవో ఎంఏ.కృష్ణన్‌, అదనపు డీఆర్డీవో శ్రీనివాస్‌, జిల్లా మహిళా సమాఖ్యల అధ్యక్ష కార్యదర్శులు రేణుక, సంతోష, మౌనిక, తదితరులు పాల్గొన్నారు.

రుణమాఫీ కాని రైతుల్లో ఆందోళన

మోత్కూరు: ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీలో రూ.1లక్ష, రూ.1.50లక్షల లోపు రుణాలు కొందరు రైతులకు మాఫీ కాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. రుణమాఫీని పర్యవేక్షించడానికి ప్రతీ బ్యాంకుకు నోడల్‌ ఆఫీసర్‌ను నియమిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఆ దిశగా చర్యలు లేవు. రైతులు బ్యాంకు వద్దకు వెళ్లి అడిగితే మాఫీ రాలేదని, ఏఈవోల వద్దకు వెళ్తే బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ తెస్తే పరిశీలించి చెబుతామంటున్నారని, బ్యాంకర్లు స్టేట్‌మెంటు ఇవ్వడం లేదని రైతులు చెబుతున్నారు. బ్యాంకు అధికారులు, ఏఈవోల మధ్య సమన్వయం కొరవడిందని, ప్రభుత్వం నోడల్‌ ఆఫీసర్లను నియమించి సమస్యలు పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Jul 31 , 2024 | 12:08 AM

Advertising
Advertising
<