ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భువనగిరిలో అంతర్జాతీయ టెన్నిస్‌ సిరీస్‌

ABN, Publish Date - Aug 24 , 2024 | 11:44 PM

అంతర్జాతీయ టెన్నిస్‌ సిరీ్‌సకు యాదాద్రిభువనగిరి జిల్లాకేంద్రమైన భువనగిరి పట్టణం ఆతిఽథ్యం ఇస్తోంది.

భువనగిరిలో అంతర్జాతీయ అండర్‌-18 టెన్నిస్‌ సిరీస్‌ క్వాలిఫై మ్యాచ ఆడుతున్న క్రీడాకారులు

ప్రారంభమైన అండర్‌-18 క్వాలిఫై మ్యాచలు

రేపటి నుంచి ప్రధాన టోర్నీ

పాల్గొననున్న సుమారు 150 మంది దేశ, విదేశీ క్రీడాకారులు

భువనగిరి టౌన, ఆగస్టు 24: అంతర్జాతీయ టెన్నిస్‌ సిరీ్‌సకు యాదాద్రిభువనగిరి జిల్లాకేంద్రమైన భువనగిరి పట్టణం ఆతిఽథ్యం ఇస్తోంది. స్థానిక న్యూడైమెన్షన టెన్సిస్‌ అకాడమీలో ఐదు రోజుల పాటు జరుగనున్న రాజా నర్సింహారావు మెమోరియల్‌ ఇంటర్నేషనల్‌ టెన్నిస్‌ ఫెడరేషన అండర్‌-18 సిరీ్‌సకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శని, ఆదివారాల్లో క్వాలిఫై మ్యాచలు జరుగనుండగా, ఈ నెల 26వ తేదీ నుంచి సెప్టెంబరు 1 వరకు ప్రధాన మ్యాచలు జరుగుతాయి. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులతో పాటు అమెరికా, కెనడా తదితర దేశాలకు చెందిన సుమారు 150మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. ఎనిమిది కోర్టుల్లో బాల బాలికలకు వేర్వేరుగా 100కు పైగా మ్యాచలు జరగనున్నాయి. టోర్నీని తొమ్మిది మంది అంపైర్లు, ఒక చీఫ్‌ రెఫరీ, ఇంటర్నేషనల్‌ టెన్నిస్‌ ఫెడరేషన ప్రతినిధి జె.శివకుమార్‌రెడ్డి ఈ సిరీ్‌సను పర్యవేక్షించనున్నారు. అందుకు కోర్టులను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దారు. ఇప్పటికే పలువురు క్రీడాకారులు భువనగిరికి చేరుకున్నారు. వారందరూ భువనగిరి, యాదగిరిగుట్టలోని హోటళ్లలో బస చేస్తున్నారు. విజేతలకు అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌ కేటాయిస్తారు. ఆల్‌ ఇండియా టెన్నిస్‌ అసోసియేషన (ఏఐటీఏ), తెలంగాణ స్టేట్‌ టెన్సిస్‌ అసోసియేషన (టీఎ్‌సటీఏ), యాదాద్రి భువనగిరి జిల్లా టెన్నిస్‌ అసోసియేషన సంయుక్తంగా నిర్వహిస్తున్న టోర్నీకి న్యూ డైమెన్షన టెన్నిస్‌ అకాడమీ అతిఽథ్యం ఇస్తోంది. ఆదివారం జరగనున్న టోర్నీ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే, టీఎ్‌సటీఏ కార్యదర్శి కేఆర్‌.రామన, ఉపాధ్యక్షుడు అశోక్‌ పాల్గొననున్నారు. కాగా, ఇదే అకాడమీలో ఈ ఏడాది ఏప్రిల్‌ 29నుంచి మే4 వరకు నేషనల్‌ టెన్నిస్‌ సిరీస్‌ జరగ్గా, నాలుగు నెలల వ్యవధిలోనే అంతర్జాతీయ టోర్నీని భువనగిరిలో నిర్వహిస్తుండడం విశేషం. ఇప్పటి వరకు భారతలో జరిగిన అంతర్జాతీయ టెన్నిస్‌ సిరీ్‌సలన్నీ ఢిల్లీ, చెన్నై, ముంబై, హైదరాబాద్‌ తదితర నగరాలకే పరిమితం కాగా, మొట్టమొదటి సారిగా గ్రామీణ ప్రాంతంలో నిర్వహిస్తున్నట్లు ఏఐటీఏ ప్రతినిధులు పేర్కొన్నారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో టెన్నిస్‌ అకాడమీలు ఉన్నట్లు టెన్నిస్‌ ప్రపంచానికి తెలియజేయడం, గ్రామీణ ప్రాంతాల్లోని టెన్నిస్‌ క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతోనే భువనగిరిలో అంతర్జాతీయ టెన్నిస్‌ సిరీ్‌సను నిర్వహిస్తున్నట్లు టీఎ్‌సటీఏ ఉపాధ్యక్షుడు అశోక్‌ తెలిపారు.

Updated Date - Aug 24 , 2024 | 11:44 PM

Advertising
Advertising
<