కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాలకు అన్యాయం
ABN, Publish Date - Jul 31 , 2024 | 12:11 AM
పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ జిల్లా ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
వలిగొండ, జూలై 30: పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ జిల్లా ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేసినా, ఈ ప్రాంత బీజేపీ ఎంపీలు నోరు మెదపకుండా ఉన్నారని విమర్శించారు. దీనిపై ఇక్కడి ఎంపీలు సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అన్యాయంపై కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నారు. బీజేపీపై పోరాడాలని, అం దుకు తమ సహకారం ఉంటుందన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రమాదాన్ని ఎదిరించడంలో ప్రగతిశీల శక్తులు ఐక్యంకావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా గత బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలు పలు ఇబ్బందులు పడ్డారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిధులు కేటాయించకుండా ఉత్తుత్తి మాటలు మాట్లాడితే ఉపయోగం లేదని, ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయాలని డిమండ్ చేశారు. నూతన రేషన్‌కార్డుల జారీకి వెంటనే జీవో విడుదల చేయాలన్నారు. పేదలు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ కూడా ఉద్యమాలపై నిర్బంధాలను ప్రయోగిస్తోందన్నారు. దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు సీతారాములు, పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, నాయకులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దోనూరు నర్సిరెడ్డి, దాసరి పాండు, మేక అశోక్‌రెడ్డి, మద్దెల రాజయ్య, సిర్పంగి స్వామి, జెల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం, దయ్యాల నర్సింహ, మాయ కృష్ణ, గంగాదేవి సైదులు, బొల్లు యాదగిరి, ఎండీ పాషా, బండారు నర్సింహ, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 31 , 2024 | 12:11 AM