ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అత్యాశకు పోయి కటకటాలపాలయ్యాడు

ABN, Publish Date - Aug 21 , 2024 | 12:04 AM

ఫైనాన్స సంస్థ నుంచి తీసుకున్న అప్పు కిస్తీ రద్దు, రూ.10లక్షల విలువైన స్ర్కాప్‌ లోడ్‌ సొంతం చేసుకునేందుకు ఓ లారీ ఓనర్‌ వేసిన పథకం బెడిసికొట్టింది.

స్వాధీనం చేసుకున్న లారీతో సీఐ వీరబాబు, ఎస్‌ఐ నరేష్‌

బెడిసికొట్టిన లారీ ఓనర్‌ పథకం

మిర్యాలగూడ అర్బన, ఆగస్టు 20: ఫైనాన్స సంస్థ నుంచి తీసుకున్న అప్పు కిస్తీ రద్దు, రూ.10లక్షల విలువైన స్ర్కాప్‌ లోడ్‌ సొంతం చేసుకునేందుకు ఓ లారీ ఓనర్‌ వేసిన పథకం బెడిసికొట్టింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రూరల్‌ సీఐ వీరబాబు మంగళవారం వెల్లడించారు. మాడ్గులపల్లి మండలం ధర్మాపురం గ్రామానికి చెందిన బందారపు నాగార్జున లారీ డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. ఐదేళ్ల కిందట ఇండోస్టార్‌ ఫైనాన్స సంస్థ నుంచి రూ.13లక్షల రుణం పొంది 12 టైర్ల లారీని కొనుగోలు చేశాడు. అదే లారీకి డ్రైవర్‌గా చేస్తూ కిరాయిలకు లారీని తిప్పుకుంటూ ప్రతినెలా రూ.54వేల కిస్తీ రూపంలో చెల్లించేలా అగ్రిమెంట్‌ చేసుకున్నాడు. అయితే ఈ ఏడాది మే నెల నుంచి నెలసరి కిస్తీలు ఫైనాన్స సంస్థకు చెల్లించకుండా ఎగ్గొట్టేందుకు పన్నాగం పన్నాడు. లారీని దొంగలు ఎత్తుకెళ్లినట్టు నమ్మించేందుకు ప్రయత్నించాడు. అందులో భాగంగా పోలీసులకు ఫిర్యాదుచేసి కేసు రిజిస్టర్‌ చేయిస్తే లారీపై ఉన్న ఫైనాన్స మొత్తం రద్దవుతుందని ఆలోచించాడు.

మూడు నెలలోగా బత్తాయి తోటలో లోడ్‌ లారీ

ఈ క్రమంలో మే 22న విశాఖపట్నం నుంచి ఐరనస్ర్కా్‌ప లోడ్‌తో బందారపు నాగార్జున మహారాష్ట్రకు లారీతో బయలుదేరాడు. మిర్యాలగూడలో తాను నివాసం ఉంటున్న దుర్గానగర్‌కు చేరుకుని తన పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నించాడు. అందులో భాగంగా రెండు రోజుల పాటు తన నివాసానికి సమీపంలోని ఖాళీస్థలంలో లారీని నిలిపాడు. అనంతరం కనగల్‌ మండలం చిన్నమాదారం గ్రామానికి చెందిన తన అల్లుడు బొడ్డుపల్లి అనిల్‌కు చెం దిన బత్తాయితోటలోని చెట్లపొదళ్ల మధ్య మే 25న లారీని దాచిపెట్టి నెంబర్‌ ప్లేట్‌ తీసేసి, ఛాసిస్‌, ఇంజన నెంబర్లు కనిపించకుండా పసుపురంగు పూసాడు. లారీని ఇక్కడ ఉంచడంతో తనకు సమస్య వస్తుందని అనిల్‌ చెప్పినప్పటికీ కొద్దిరోజుల్లోనే లారీని తీసుకెళ్తానని బతిమాలుకొని తోటలో ఉంచి వెళ్లాడు. లారీచోరీకి గురైనట్లు ఎఫ్‌ఐఆర్‌ నమోదైతే ఫైనాన్స రద్దు కావడంతో పాటు మహారాష్ట్రలోని జేకేస్టీల్‌ కంపెనీకి డెలివరీ ఇవ్వాల్సిన రూ.10లక్షల విలువైన ఐరన స్ర్కాప్‌తో పాటు లారీ మిగిలిపోతుందన్న ఆత్యాశతో తన పథకం అమలుకు ప్రయత్నించాడు. తన లారీ చోరీకి గురైనట్లు మే 26న రూరల్‌ పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదుచేశాడు. దీనిపై అనుమానం కలిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ మొదలుపెట్టారు. ఈ సందర్భంలో గత కొద్దిరోజులుగా చిన్నమాదారం గ్రామంలోని అనిల్‌ అనేవ్యక్తికి చెందిన బత్తాయి తోటలో లారీ ఉన్నట్లుగా పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో రూరల్‌ సీఐ వీరబాబు, ఎస్‌ఐ నరే్‌షతో కలిసి మంగళవారం తోటకు వెళ్లి లారీని పరిశీలించారు. సదరు లారీ ఇంజన, ఛాసిస్‌ నెంబర్‌ ఆధారంగా ఇండోస్టార్‌ ఫైనాన్స సంస్థ ఆర్థికసాయంతో నాగార్జున కొనుగోలు చేసిన టీఎ్‌స05యూసీ 5577 నెంబర్‌గల వాహనంగా గుర్తించిట్లు సీఐ తెలిపారు.ఫైనాన్ససంస్థను, పోలీసులను పక్కదారి పట్టించేలా వ్యవహరించిన లారీ ఓనర్‌ నాగార్జునపై కేసు నమోదు చేసి, నిందితుడి నుంచి అశోక్‌లేలాండ్‌ కంపెనీకి చెందిన 12 టైర్‌ లారీ,రూ.12లక్షల విలువైన జేకేస్టీల్‌ కంపెనీకి చెందిన ఐరనస్ర్కా్‌ప, లారీపత్రాలు, సెల్‌ఫోనను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు.కేసును ఛేదించిన సీఐ,ఎస్‌ఐలతో పాటు ఏఎ్‌సఐ గఫార్‌, రాములునాయక్‌ను డీఎస్పీ అభినందించారు.

Updated Date - Aug 21 , 2024 | 12:04 AM

Advertising
Advertising
<