ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

ABN, Publish Date - Apr 24 , 2024 | 12:34 AM

మండల వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి, రైతుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్‌రెడ్డి అన్నారు.

సిరిపురంలో ధాన్యం కేంద్రాన్ని పరిశీలిస్తున్న రైతుసంఘం నాయకులు

రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్‌రెడ్డి

రామన్నపేట, ఏప్రిల్‌ 23: మండల వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి, రైతుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని సిరిపురం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని పరిశీలించి, అనంతరం మాట్లాడారు. వాతావరణంలో మార్పులు వచ్చి వర్షాలు, ఈదురు గాలులకు పండించిన ధాన్యం నేలపాలవుతుందన్నారు. గన్నీ బ్యాగుల కొరత మూలంగా కొనుగోలు వేగవంతం జరగడం లేదన్నారు. సంబంధిత మండల, జిల్లా అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లు యజమానులు కుమ్మక్కై రైతులకు మద్దతు ధర అందించడం లేదన్నారు. రబీ సీజన వరి కోతలు ప్రారంభమై నెల రోజులు పూర్తికావస్తున్నా ఇప్పటికీ 30శాతం కొనుగోళ్లు జరగలేదన్నారు. వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు బల్గూరి అంజయ్య, ఎంపీటీసీ బడుగు రమేష్‌, శాఖ కార్యదర్శి అంబటి మల్లారెడ్డి, తదితర రైతులు సుభా్‌షరెడ్డి, కట్ట లక్ష్మారెడ్డి, కె.యాదగిరి, మల్లయ్య పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2024 | 12:34 AM

Advertising
Advertising