ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మతోన్మాద పార్టీలను ఓడించాలి: సీపీఎం

ABN, Publish Date - Apr 24 , 2024 | 12:25 AM

అవకాశవాద, మతోన్మాద పార్టీలను ఓడించి నిజాయితీ కలిగిన సీపీఎం అభ్యర్థి జహంగీర్‌ను గెలిపించాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు బీ వెంకట్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వెంకట్‌

బీబీనగర్‌, ఏప్రిల్‌ 23 : అవకాశవాద, మతోన్మాద పార్టీలను ఓడించి నిజాయితీ కలిగిన సీపీఎం అభ్యర్థి జహంగీర్‌ను గెలిపించాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు బీ వెంకట్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం యాదాద్రిభువనగిరి జిల్లా బీబీనగర్‌లో భువనగిరి సీపీఎం అభ్యర్థి జహంగీర్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అనంతరం ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్యం, పౌరహక్కులు ఉండాలంటే కేంద్రంలో బీజేపీ ఓడి, ఇండియా కూటమి అధికారంలోకి రావాలన్నారు. కూటమి గెలిస్తే ప్రజలు అభివృద్ధి చెందుతారని అదే బీజేపీ గెలిస్తే కార్పొరేట్‌ శక్తులైన అదానీ, అంబానీల సంపదలు పెరుగుతాయని ఆరోపించారు. ఓడిపోతామన్న భయంతో ప్రధాని మోదీ రాజస్థాన ఎన్నికల ప్రచారంలో ముస్లిం, హిందువుల మధ్య విద్వేశం పెరిగేలా ప్రసంగించారని అన్నారు. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేట్‌పరం అవుతాయన్నారు. బీజేపీ మేనిఫెస్టో ప్రజలపై భారాలు మోపి జీవితాలతో ఆడుకునేలా ఉందని విమర్శించారు. బీజేపీ 10ఏళ్ల పాలనలో వైఫల్యాలతో అధికారం కోల్పోతుందని జోష్యం చెప్పారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శివకుమార్‌, ముత్యాలు, సీపీఎం మండల కార్యదర్శి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2024 | 12:25 AM

Advertising
Advertising