ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

క్షేత్రస్థాయికి కాంగ్రెస్‌

ABN, Publish Date - Apr 25 , 2024 | 12:26 AM

సార్వత్రిక ఎన్నికలకు మ రో మూడు వారాల గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. కాంగ్రెస్‌ ఈ నెల 25నుంచి క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు సన్నాహాలు చేసింది.

నేటి నుంచి నిత్యం మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం

యాదాద్రి, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికలకు మ రో మూడు వారాల గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. కాంగ్రెస్‌ ఈ నెల 25నుంచి క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు సన్నాహాలు చేసింది. నిత్యం మూడు నియోజకవర్గాల్లో పర్యటించి, స్థానిక ఓటర్లను కలిసేందుకు ప్రయత్నా లు చేస్తోంది. గ్రామీణ, పట్టణప్రాంతాల్లోని రైతులు, వ్యవసా య కూలీలు, వివిధ వృత్తులు చేసుకుంటున్న ప్రజలకు చేరువయ్యేలా ప్రయత్నిస్తోంది. అన్ని మండలాల్లోనూ కులసంఘాలతో సమావేశాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. 15రోజుల పాటు క్షేత్రస్థాయిల్లోనే రోడ్‌షోలో, కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహించేందుకు షెడ్యూల్‌ను రూపొందించారు. మొదటిరోజు నకిరేకల్‌, తుంగుతుర్తి, ఆలేరు, నియోజకవర్గాల్లో పర్యటించేందుకు షెడ్యూల్‌ ఖరారు చేసింది. ఈ ప్రచార కార్యక్రమంలో భు వనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రచారంలో పాల్గొంటారు. నకిరేకల్‌ నియోజకవర్గంలోని రామన్నపేట మండల పరిధిలోని ఇంద్రపాల నగరం నుంచి ఉద యం 10గంటలకు రోడ్‌షో కార్యక్రమం ఉంటుంది. నాలుగు గంటలకు తుంగతుర్తి ని యోజకవర్గంలోని మోత్కురు మునిసిపాలిటీలో, నార్కట్‌పల్లి రోడ్‌నుంచి శ్రీకాంతాచారి చౌరస్తావరకు రోడ్‌షో... ఏడు గంటలకు ఆలేరు మునిసిపాలిటీ రైల్వే అండర్‌పాస్‌ బ్రిడ్జీ వద్ద కార్నర్‌ మీటింగ్‌ ఏర్పాటుచేశారు. 26న ఉదయం 10నుంచి ఒంటిగంట వరకు భువనగిరి నియోజకవర్గం భూదాన్‌పోచంపల్లిలో, సాయంత్రం 4నుంచి 7గంటల వరకు రోడ్‌షోలు, మునుగోడు నియోజకవర్గం మునుగోడులో రాత్రి 7నుంచి10గంటల వరకు కార్న ర్‌ మీటింగ్‌ ఉంటుంది. ఈ నెల 27న ఆలేరు నియోజవకర్గం బొమ్మలరామారంలో, జన గామ నియోజకవర్గం జనగామలో రోడ్‌షోలు, తుంగతుర్తి నియోజకవర్గం తుంగతుర్తిలో రాత్రి 7గంటలకు కార్నర్‌ మీటింగ్‌ ఉంటుంది. ఇదే మాదిరిగా ఎన్నికల ప్రచారాన్ని అన్ని నియోజకవర్గాల్లోనూ చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - Apr 25 , 2024 | 12:26 AM

Advertising
Advertising