ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డీఈవో ఉత్తర్వులతో అయోమయం

ABN, Publish Date - Aug 24 , 2024 | 11:40 PM

డీఈవో ఉత్తర్వులు నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని అమ్మనబోలు గ్రామస్తులను అయోమయానికి గురిచేస్తోంది.

డీఈవో జారీ చేసిన ఉత్తర్వు కాపీ

ప్రొసీడింగ్స్‌లో కొత్తగా ఏర్పాటైన మండలంగా అమ్మనబోలు

మండలంగా ఏర్పాటు కానప్పుడు ఎలా పేర్కొంటారని చర్చ

నార్కట్‌పల్లి, ఆగస్టు 24 : డీఈవో ఉత్తర్వులు నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని అమ్మనబోలు గ్రామస్తులను అయోమయానికి గురిచేస్తోంది. గత బీఆర్‌ఎస్‌ హయాంలో తమ గ్రామాన్ని చుట్టుపక్కల గ్రామాలతో కలిపి మండల కేంద్రంగా ప్రకటించాలని ఏడాదిపాటు గ్రామస్తులు రిలే దీక్షలు చేశారు. పార్టీలకతీతంగా ఈ దీక్షలోఓ్ల పాల్గొన్నారు. ప్రజాందోళనకు దిగివచ్చిన అప్పటి ప్రభుత్వం హడావిడిగా ఐదు గ్రామాలతో కూడిన అమ్మనబోలును మండల కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు ప్రక్రియను ప్రారంభించింది. కొద్దిరోజులైతే గెజిట్‌ కూడా వెలువడేదే కానీ, ఇంతలోనే అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన వచ్చింది. దీంతో అమ్మనబోలు మండల ఏర్పాటుకు బ్రేక్‌ పడింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ హయాంలో నేటికీ మండల ఏర్పాటుపై అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉండగా జిల్లా విద్యాశాఖాధికారి పేరిట తాజాగా జారీ అయిన ఓ ఉత్తర్వుల్లో అమ్మనబోలును కొత్తగా ఏర్పడిన మండలంగా పేర్కొనడం ఆశ్చర్యానికి, అయోమయానికి గురిచేస్తోంది.

తొలిమెట్టుకు ఎంఎనవోగా..

ప్రభుత్వ పాఠశాలల్లో తొలిమెట్టు కార్యక్రమాన్ని విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆయా పాఠశాలల్లో తొలిమెట్టు పర్యవేక్షణ బాధ్యతను ఆయా మండలాల విద్యాధికారులపై అప్పగించింది. అయితే ఎంఈవోలు లేని మండలాల్లో జీహెచఎంలలో సీనియర్లను ఎంపిక చేసి మండల నోడల్‌ అధికారులు(ఎంఎనవో) నియమించి తొలిమెట్టు కార్యక్రమ పర్యవేక్షణ అదనపు బాధ్యతను అప్పగిస్తోంది. ఇందులో భాగంగా డీఈవో పేరిట ఈ నెల 22న ప్రొసీడింగ్స్‌ జారీ అయ్యాయి. ఇలా ఇటీవల గట్టుప్పల్‌, గుడిపల్లి మండలాలతో పాటు నార్కట్‌పల్లి మండలంలోని అమ్మనబోలుకు కూడా జే.శేఖర్‌రెడ్డి అనే గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుడిని ఎంఎనవోగా నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆ ఆర్డర్‌ కాపీలోని పట్టిక రిమార్క్స్‌ కాలంలో గట్టుప్పల్‌, గుడిపల్లితో పాటు అమ్మనబోలును కూడా కొత్తగా ఏర్పాటైన మండలంగా పేర్కొంటూనే ప్రొసీడింగ్స్‌ను జారీ చేశారు.

చర్చకు దారితీసిన ఉత్తర్వులు

అమ్మనబోలు మండలంగా లాంఛనంగా ఏర్పాటు కానపుడు విద్యాశాఖ అధికారులు జారీ చేస్తున్న అధికారిక ఉత్తర్వుల్లో మాత్రం కొత్తగా ఏర్పాటైన మండలమంటూ పేర్కొనడం చర్చకు దారితీసింది. డీఈవో ఉత్తర్వులో అమ్మనబోలును కొత్తగా ఏర్పాటైన మండలంగా పేర్కొనడం యథాలాపంగా జరిగిందా? లేక సాంకేతికంగా విద్యాశాఖ మండలంగా గుర్తిస్తుందా అనేది అర్థం కావడం లేదు. గతంలో కూడా ఇదే రకంగా ఉత్తర్వులు రాగా సరిచేసినట్లు తెలిసింది.

Updated Date - Aug 24 , 2024 | 11:40 PM

Advertising
Advertising
<