ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రైతులందరికీ రుణమాఫీ చేయాలి

ABN, Publish Date - Aug 24 , 2024 | 12:34 AM

వివిధ బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణాలను ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఏపీజీవీబీ ఎదుట ధర్నా చేస్తున్న రైతు సంఘం నాయకులు

ఆత్మకూరు(ఎం), ఆగస్టు 23: వివిధ బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణాలను ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏపీజీవీబీ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తెచ్చిన మార్గదర్శకాలను తక్షణమే సవరించాలన్నారు. రేషనకార్డు, ఐటీ రిటర్న్స్‌, రీషెడ్యూల్‌ లాంటి వాటిని పరిగణలోకి తీససుకోవద్దన్నారు. కొంత మంది రైతులకు రుణమాఫీ కాకపోవడంతో రైతులు పనులు మానుకుని బ్యాంకు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌ సఫియొద్దీనకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి వేముల భిక్షం, సీఐటీయూ మండల నాయకులు రచ్చ గోవర్థన, గ్రామశాఖ కార్యదర్శి రాచమల్ల సత్తయ్య, తుమ్మల సత్యనారాయణ, పల్లేర్ల బుచ్చయ్య, వాకిటి మల్లరెడ్డి, కృష్ణారెడ్డి, మత్స్యగిరి, చంద్రయ్య పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 12:35 AM

Advertising
Advertising
<