ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలి

ABN, Publish Date - Aug 21 , 2024 | 12:38 AM

అర్హులైన రైతులందరికీ రూ.రెండు లక్షల రుణమాఫీ చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బూరుగు కృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు.

చౌటుప్పల్‌ వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న రైతులు

చౌటుప్పల్‌ టౌన, ఆగస్టు 20: అర్హులైన రైతులందరికీ రూ.రెండు లక్షల రుణమాఫీ చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బూరుగు కృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం చౌటుప్పల్‌ పట్టణంలోని మండల వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట తెలంగాణ రైతు సంఘం (సీపీఎం) ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బూరుగు కృష్ణారెడ్డి మాట్లాడుతూ కొద్ది మంది రైతులకే రెండు లక్షల రుణమాఫీ జరిగిందని, రుణమాఫీ జరగని రైతులు తీవ్రంగా బాధపడుతూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. గ్రామాల వారీగా ప్రత్యేక సదస్సులను నిర్వహించి అర్హులైన రైతులను గుర్తించి రుణమాఫీ చేయాలని ఆయన కోరారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని ఆయన హెచ్చరించారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎండి.పాషా, మండల, పట్టణ కార్యదర్శులు గంగదేవి సైదులు, బండారు నర్సింహ, పీఏసీఎస్‌ మాజీ చైర్మన చీరిక సంజీవ రెడ్డి, రైతు సంఘం నాయకులు చీరిక అలివేలు, జక్కిడి రామ్‌రెడ్డి, మునగాల మాసిరెడ్డి, జక్కిడి గోపాల్‌రెడ్డి, వి.పెంటారెడ్డి, ఎం.లక్ష్మయ్య, వి.నర్సింహ పాల్గొన్నారు. అనంతరం ఏవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

Updated Date - Aug 21 , 2024 | 12:38 AM

Advertising
Advertising
<