ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి

ABN, Publish Date - Aug 09 , 2024 | 11:31 PM

నాగుల చవితి పండుగను జడ్చర్లలో భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు

భూత్పూర్‌లో నాగుల విగ్రహాలకు పూజలు చేస్తున్న భక్తులు

జడ్చర్ల, ఆగస్టు 9 : నాగుల చవితి పండుగను జడ్చర్లలో భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పట్టణంలోని బంగారుమైసమ్మ దేవాలయం, శ్రీరేణుకాఎల్లమ్మ దేవాలయం, పాతబజారులోని శివాలయంలో నాగుల చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. బంగారుమైసమ్మ దేవాల యం ప్రాంగణంలో ఉన్న పుట్టలో భక్తులు పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. విద్యానగర్‌కాలనీలోని శ్రీరేణుకా ఎల్లమ్మ దేవాలయంలో నాగ దేవతకు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు సామూహిక కుంకు మా ర్చన నిర్వహించారు.

ఫ భూత్పూర్‌ : నాగుల పంచమి సందర్భంగా శుక్రవారం మండలం లోని అన్నీ గ్రామాల్లో ఉన్న శివాలల్లో శివుడికి అభిషేకాలు, నాగులకు పూజలు చేశారు. అదే విధంగా పుట్టలో పాలు పోశి మహిళలు నాగ దేవ తకు పూజలు చేశారు. మండల కేంద్రంలో ఉన్న శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయం ఆవరణలో ఉన్న నాగ దేవతలకు, అదే విధంగా మునిరంగస్వామి దేవాలయం ఆవరణలో వెలసిన నాగేంద్రస్వామికి మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

ఫ దేవరకద్ర : నియోజకవర్గంలోని దేవరకద్ర, కౌకుంట్ల మండలాలతో పాటు వివిధ అన్ని గ్రామాల్లో శుక్రవారం నాగుల పంచమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఆలయాల్లో అర్చకులు స్వామి వారికి ప్రత్యక పూజలు అబీషేకాలు ఆలంకర్ణ వంటి కార్యక్రమాలను నిర్వహించారు. పట్టణంలోని మహిళలు, భక్తులు, కొత్తగా పేళ్లియిన జంటలు నాగులకు పాలు పోసి నైవేధ్యం సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. దీంతో ఆలయలాల్లో భక్తులతో కిటకిటలాడింది.

Updated Date - Aug 09 , 2024 | 11:31 PM

Advertising
Advertising
<