ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జాతీయ లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరించాలి

ABN, Publish Date - Aug 24 , 2024 | 11:15 PM

వచ్చేనెల 24వ తేదీన జరగనున్న జాతీయ లోక్‌ అదాలత్‌లో ఎక్కువ మంది కక్షిదారులను తీసుకువచ్చి అత్యధిక కేసులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర అన్నారు.

పోలీసుల సమావేశంలో మాట్లాడుతున్న న్యాయసేవా అధికారసంస్థ కార్యదర్శి ఇందిర

- న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర

మహబూబ్‌నగర్‌, ఆగస్టు 24 : వచ్చేనెల 24వ తేదీన జరగనున్న జాతీయ లోక్‌ అదాలత్‌లో ఎక్కువ మంది కక్షిదారులను తీసుకువచ్చి అత్యధిక కేసులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర అన్నారు. శనివారం జిల్లా ప్రధాన న్యాయాధికారి పాపిరెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కోర్టు ఆవరణలో కోర్టు కానిస్టేబుళ్లు, ట్రాఫిక్‌ పోలీసులతో జాతీయ లోక్‌ అదాలత్‌ గురించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రిమినల్‌ కంపౌడబుల్‌, సివిల్‌ కేసులు, డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు, భూతగాద కేసులు, ఈపెటీ, ట్రాఫిక్‌ చలానా, ఎన్‌ఐ యాక్ట్‌ కేసులను వీలైనంత అధిక సంఖ్యలో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో రెండో తరగతి మేజిస్ట్రేట్‌ శశిధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 11:15 PM

Advertising
Advertising
<