ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad- సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి

ABN, Publish Date - Sep 10 , 2024 | 11:15 PM

జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో చేపడుతున్న సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలని జిల్లా ఇన్‌చార్జి ముల్కల మల్లారెడ్డి, ఎమ్మెల్యే హరీష్‌బాబు అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించన పార్టీ సభ్యత్వ నమోదు క్యాక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

పార్టీ సభ్యత్వ నమోదు చేపడుతున్న జిల్లా ఇన్‌చార్జి, ఎమ్మెల్యేలు

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 10: జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో చేపడుతున్న సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలని జిల్లా ఇన్‌చార్జి ముల్కల మల్లారెడ్డి, ఎమ్మెల్యే హరీష్‌బాబు అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించన పార్టీ సభ్యత్వ నమోదు క్యాక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో 1,20,000 సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని చేరుకోవాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. బీజేపీ సభ్యత్వం తీసుకునేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పది నెలల్లోనే ప్రజల వ్యతిరేతకను ఎదుర్కొంటుందన్నారు. కాంగ్రెస్‌పార్టీ గ్రూపు రాజీయాలు ఎక్కువయ్యాయని, బీజేపీ పరిపాలన కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. జిల్లాలో ఆదివాసీ మహిళలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ప్రజల ముందు ఎండగడుతా మన్నారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న వవారు కూడా సభ్యత్వం తీసుకోవాలన్నారు. నాయకులు పార్టీన స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చే అవవకాశం ఉందన్నారు. ప్రజా సమస్యలపై కార్యకర్తలు నిత్యం ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. ఇప్పటి వరకు రైతులకు రుణ మాఫీ కాలేదని, రైతు భరోసాపై ఊసేలేదని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు శ్యాంసుందర్‌, మురళీ, విశాల్‌, విజయ్‌, కిరణ్‌, సొల్లు లక్ష్మి, ఆంజనేయులుగౌడ్‌, రాధిక తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2024 | 11:15 PM

Advertising
Advertising