ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..

ABN, Publish Date - Jun 20 , 2024 | 11:48 PM

హుస్నాబాద్‌రూరల్‌, జూన్‌ 20: ముగ్గురు కూతుళ్ల వివాహం చేసిన అనంతరం భార్యాభర్తలు అన్యోనంగా గడపాల్సిన సమయంలో భార్య మరొకరితో వివాహేత సంబంధం పెట్టుకుంది.

ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిన భార్య

హుస్నాబాద్‌రూరల్‌, జూన్‌ 20: ముగ్గురు కూతుళ్ల వివాహం చేసిన అనంతరం భార్యాభర్తలు అన్యోనంగా గడపాల్సిన సమయంలో భార్య మరొకరితో వివాహేత సంబంధం పెట్టుకుంది. ఈ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి అతడిని అతి దారుణంగా హత్య చేసింది. అయితే, సొంత ఇంట్లోనే చంపేసి.. తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని ఇరుగుపొరుగు వారికి చెప్పింది. మూడు రోజుల క్రితం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం కూచనపల్లి గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న గీకురు నర్సయ్యను గొడ్డలితో నరికి చంపిన కేసులో భార్య, ఆమె ప్రియుడు నిందితులుగా పోలీసులు తేల్చారు. సీఐ శ్రీనివాస్‌ గురువారం హత్య సంఘటన వివరాలను వెల్లడించారు. గ్రామానికి చెందిన నర్సయ్యకు భార్య, ముగ్గురు కూతుళ్ల ఉండగా, అందరి పెళ్లిళ్లు చేశాడు. అయితే, అతని భార్య ఎల్లవ్వ అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన మహ్మద్‌ రజాక్‌తో కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. విషయం తెలిసి నర్సయ్య భార్యను పలుమార్లు హెచ్చరించాడు. అయినా, ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు సరికదా.. తమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి, అతనిని హత్య చేయాలని పథకం వేసింది. ప్రియుడు రంజాన్‌, ఎల్లవ్వ కలిసి గత సోమవారం రాత్రి ఇంట్లో నిద్రపోతున్న నర్సయ్యను గొడ్డలితో దారుణంగా నరికి చంపేశారు. తర్వాత మధ్య రాత్రి తన భర్తను ఎవరో చంపేశారని రోదిస్తూ ఇరుగు, పొరుగు వారికి ఎల్లవ్వ చెప్పింది. వారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి వివరాలు సేకరించారు. అయితే, నర్సయ్యను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉందనే కోణంలో దర్యాప్తు చేపట్టగా, పోలీసులకు భార్యపై అనుమానం వచ్చింది. దీంతో ఎల్లవ్వను ప్రశ్నించగా.. జరిగిన విషయం బయటపడింది. దీంతో ఎల్లవ్వతో పాటు ఆమె ప్రియుడు రజాక్‌ను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకుని, ఇద్దరినీ రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Jun 20 , 2024 | 11:48 PM

Advertising
Advertising