ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

తెలంగాణ ప్రజల గొంతుక బీఆర్‌ఎస్‌

ABN, Publish Date - Jun 07 , 2024 | 11:28 PM

ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి

విలేకరులతో మాట్లాడుతున్న ప్రతా్‌పరెడ్డి

గజ్వేల్‌, జూన్‌ 7: తెలంగాణ ప్రజల గొంతుకగా బీఆర్‌ఎస్‌ నిలుస్తుందని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి పేర్కొన్నారు. గజ్వేల్‌ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎ్‌సకు ప్రతిపక్ష హోదాను ఇచ్చారని, ఆ హోదాతో ప్రజా సమస్యలపై పోరాడుతామన్నారు. సమస్యలు ఉన్న చోట బీఆర్‌ఎస్‌ ఉంటుందని, తాను ఉంటానని, గజ్వేల్‌ ప్రజలకు అండగా నిలుస్తానని తెలిపారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో గజ్వేల్‌ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికి ఓటు వేశారని, బీఆర్‌ఎ్‌సకు ఓటు వేసిన ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్‌ తరఫున, తన తరఫున కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్‌రెడ్డి సిద్దిపేట ఓట్లపై మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని, ఏ పార్టీ నాయకుడు కూడా ఇతర పార్టీలకు ఓటు వేయాలని చెప్పరన్నారు. రింగ్‌రోడ్డు పనులను పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం కృషిచేయాలని డిమాండ్‌ చేశారు. ఆయనవెంట జడ్పీటీసీ పంగ మల్లేశం, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ జకీయోద్దీన్‌, పట్టణ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు నవాజ్‌మీరా, నాయకులు విరాసత్‌అలీ, కౌన్సిలర్లు ఉప్పల మెట్టయ్య, గోపాల్‌రెడ్డి, అత్తెల్లి శ్రీనివాస్‌, బొగ్గుల చందు, నాయకులు దయాకర్‌రెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, మాజీ జడ్పీటీసీ బోల్లారం ఎల్లయ్య, భూపాల్‌రెడ్డి, నర్సింగరావు, అహ్మద్‌, పొన్నాల కుమార్‌, స్వామిచారీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2024 | 11:28 PM

Advertising
Advertising