ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఐలాపూర్‌ మళ్లీ కబ్జాల కలకలం

ABN, Publish Date - Jul 06 , 2024 | 11:37 PM

పటాన్‌చెరు, జూలై 6: వివాదాస్పద ఐలాపూర్‌ భూముల్లో మళ్లీ కబ్జాదారుల కదలికలు ప్రారంభమయ్యాయి. అమీన్‌పూర్‌ మండలం ఐలాపూర్‌ గ్రామంలో కోర్టు వివాదంలో నలుగుతున్న భూములను పరిరక్షించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఐలాపూర్‌ భూములను చదును చేస్తున్న గుర్తుతెలియని వ్యక్తులు

వివాదాస్పద భూముల్లో అక్రమార్కుల ప్రవేశం

చోద్యం చూస్తున్న రెవెన్యూ సిబ్బంది

పటాన్‌చెరు, జూలై 6: వివాదాస్పద ఐలాపూర్‌ భూముల్లో మళ్లీ కబ్జాదారుల కదలికలు ప్రారంభమయ్యాయి. అమీన్‌పూర్‌ మండలం ఐలాపూర్‌ గ్రామంలో కోర్టు వివాదంలో నలుగుతున్న భూములను పరిరక్షించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రాజగోపాల్‌నగర్‌గా లేఅవుట్‌ చేసిన స్థలాలను దొడ్డిదారిన కబ్జా చేసి విక్రయించే పనులు ఊపందుకున్నాయి. సదరు భూములపై హక్కుల కోసం రాజగోపాల్‌నగర్‌ ప్లాట్ల బాధితులు కోర్టులో న్యాయ పోరాటం చేస్తుండగానే.. అసైన్‌మెంట్‌దారుల పేరిట భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐలాపూర్‌ గ్రామంలో సర్వే నంబర్‌ 1 నుంచి 220 వరకు ఉన్న సర్వే నంబర్లలోని వందల ఎకరాల భూములపై హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వం మరో వైపు ప్లాట్ల యజమానులు, గ్రామ రైతులు భూములు తమకే చెందాలని న్యాయపోరాటం చేస్తున్నారు. ఇదే అదనుగా వివాదాస్పద భూములను ఆక్రమించి సొమ్ము చేసుకునే ల్యాండ్‌ మాఫియా ముఠాలు రంగంలోకి దిగాయి. గతంలో వివాదాస్పద భూముల్లో ప్లాట్లు చేసి నోటరీల ద్వారా విక్రయించి కోట్లాది రూపాయలు దండుకున్న భూ మాఫియా అధికారుల చర్యలతో కొద్దిరోజులు స్తబ్దుగా ఉన్నది. కానీ, ఇటీవల పలు సర్వే నంబర్లలో నాట్‌ టు ఎంటర్‌ ఫియర్‌ పేరుతో కోర్టు డిక్రీని చూపిస్తూ భూములను చదును చేస్తున్నారు.

గతంలో కూల్చివేతలు

గతంలో ఇదే గ్రామంలో నోటరీల ద్వారా ప్లాట్లు కొనుగోలు చేసి నిరుపేదలు కట్టుకున్న వందల ఇళ్లను రెవెన్యూ సిబ్బంది కూల్చివేయడం వివాదాస్పదమైంది. మరోసారి నోటరీ ద్వారా ప్లాట్ల విక్రయానికి సిద్ధమవుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఆ భూములను చదును చేస్తున్నారన్న సమాచారంతో అమీన్‌పూర్‌ డిప్యూటీ తహసీల్దార్‌ బాల్‌రాజ్‌ సంఘటనా స్థలానికి వెళ్లి పనులను అడ్డుకున్నారు. కాగా, ఐలాపూర్‌లో జరుగుతున్న అక్రమాలపై జిల్లా కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సమగ్ర నివేదిక సమర్పించాలని తహసీల్దార్‌ను ఆదేశించినట్లు సమాచారం.

Updated Date - Jul 06 , 2024 | 11:37 PM

Advertising
Advertising
<