నీటి వనరులను మితంగా వాడుకోవాలి
ABN, Publish Date - Apr 13 , 2024 | 11:22 PM
ప్రస్తుత వేసవిలో నీటి వనరులను మితంగా వాడుకోవాలని, నీటి వినియోగంపై ఇరుగుపొరుగు వారికి అవగాహన కల్పించాలని భూగర్భ జల వనరుల పెంపకానికి ఇంటికో ఇంకుడు గుంత నిర్మించుకోవాలని జిల్లా విద్యాశాఖ ఏఎంవో విద్యాసాగర్ అన్నారు.
విద్యాశాఖ ఏఎంవో విద్యాసాగర్
కోస్గి రూరల్, ఏప్రిల్ 13 : ప్రస్తుత వేసవిలో నీటి వనరులను మితంగా వాడుకోవాలని, నీటి వినియోగంపై ఇరుగుపొరుగు వారికి అవగాహన కల్పించాలని భూగర్భ జల వనరుల పెంపకానికి ఇంటికో ఇంకుడు గుంత నిర్మించుకోవాలని జిల్లా విద్యాశాఖ ఏఎంవో విద్యాసాగర్ అన్నారు. శనివారం పట్టణంలోని ఆయా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులచే వాక్ ఫర్ వాటర్ స్వచ్చంద సంస్థ సౌజన్యంతో నీటిని పొదుపుగా వాడుకోవాలని జల సంరక్షణ అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నీటి పొదుపుపై విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీరంతా నీటి యొక్క విలువను అవగాహన చేసుకొని మీ కుటుంబ సభ్యులకు మీ చుట్టుపక్కల వాళ్లకు తెలియజేయాలన్నారు. నీరు చాలా విలువైనదని దాని సంరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రస్తుతం కర్ణాటకలోని బెంగళూరు పరిస్థితిని గుర్తు చేశారు. పలువురు జీవశాస్త్ర ఉపాధ్యాయులు మాట్లాడుతూ మనం నిత్యం వాడే నీటిని ఎలా ఒడిసి పట్టాలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా సెక్టోరియల్ అధికారి శ్రీనివాసులు, మండల నోడల్ అధికారి శంకర్‌నాయక్, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, వాక్ ఫర్ వాటర్ స్వచ్ఛంద సంస్థ వలంటీర్ వీర మల్లేష్ ఉన్నారు.
Updated Date - Apr 13 , 2024 | 11:22 PM