ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

తొలిరోజు రెండు నామినేషన్లు

ABN, Publish Date - Apr 18 , 2024 | 11:21 PM

పార్లమెంట్‌ ఎన్నికలకు సంబం ధించి మొదటి ఘట్టం గురువారం ప్రారంభమైంది. ఉదయం 11గంటలకు నోటి ఫికేషన్‌ ప్రక్రియ జారీ కాగానే నామినేషన్లు దాఖలు చేసే అంశానికి తెరదీసింది. తొలిరోజు రెండు నామినేషన్లు దాఖలయ్యాయి.

నామినేషన్‌ పత్రాలను అందజేస్తున్న కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి మల్లురవి

- ముహూర్త బలం ప్రకారం చెరొక సెట్‌ నామినేషన్‌ పత్రాలను

దాఖలు చేసిన మల్లురవి, భరత్‌ప్రసాద్‌

నాగర్‌కర్నూల్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి) : పార్లమెంట్‌ ఎన్నికలకు సంబం ధించి మొదటి ఘట్టం గురువారం ప్రారంభమైంది. ఉదయం 11గంటలకు నోటి ఫికేషన్‌ ప్రక్రియ జారీ కాగానే నామినేషన్లు దాఖలు చేసే అంశానికి తెరదీసింది. తొలిరోజు రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్‌ నుంచి డాక్టర్‌ మల్లురవి మధ్యాహ్నం 1:30గంటలకు తన నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి పి.ఉదయ్‌కు మార్‌కు అందజేశారు. ఆయన వెంట అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యేలు డాక్టర్‌ వంశీకృష్ణ, కూచకుళ్ల రాజేష్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మ ల్లురవి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ నెల 23న మరో సెట్‌ నామి నేషన్‌ పత్రాన్ని దాఖలు చేస్తానని ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా హాజరవుతారని తెలిపారు. అంతకంటే ముందు మధ్యాహ్నం 12:20గంటలకు బీజేపీ అభ్యర్థి భరత్‌ప్రసాద్‌ కూడా తన నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి పి.ఉదయ్‌కుమార్‌కు అందజేశారు. ఉమామహేశ్వరంలో ప్రత్యేక పూజల అనంతరం తన తండ్రి ప్రస్తుత పార్లమెంట్‌ సభ్యుడు పోతుగంటి రాములు, ఎమ్మెల్యే రమణారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు జక్కారఘునందన్‌రెడ్డిలతో కలిసి కలెక్టరేట్‌కు చేరుకున్న ఆయన ఒక సెట్‌ నామినేషన్‌ను అందజేశారు. కాగా, పార్లమెంటు ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదటి రోజు కవరేజీ కోసం వెళ్లిన జర్నలిస్టులకు ఇబ్బంది ఎదురైంది. నామినేష న్‌ కేంద్రం వద్ద జర్నలిస్టుల కోసం మీడియా పాయింట్‌ ఏర్పాటు చేయకపోవడం తో జర్నలిస్టులు గంటల తరబడి ఎండలో నిల్చొని తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Updated Date - Apr 18 , 2024 | 11:21 PM

Advertising
Advertising