ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డికి ఘన నివాళి

ABN, Publish Date - Aug 21 , 2024 | 11:04 PM

దివంగత చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి జయంతి వేడుకలను స్థానిక సీవీఆర్‌ బంగ్లాలో నాయకులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు.

ధన్వాడలోని సీఎన్‌ఆర్‌ ఘాట్‌ వద్ద నివాళి ఆర్పిస్తున్న ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి

నారాయణపేట టౌన్‌/ధన్వాడ, ఆగస్టు 21 : దివంగత చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి జయంతి వేడుకలను స్థానిక సీవీఆర్‌ బంగ్లాలో నాయకులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. స్థానిక గంజ్‌ వద్ద గల వెంకటేశ్వర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సీవీఆర్‌ బంగ్లాలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి రక్తదానం చేశారు. అలాగే చిన్నపిల్లల ఆసుపత్రికి ప్యాన్లు అందించగా, లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి మాట్లాడుతూ.. వెనకబడిన నారాయణపేటలో విద్య, వైద్యం అందించాలనే తన తండ్రి ఆశయ సాధన కోసం పనిచేస్తానన్నారు. మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన కృష్ణా - వికారాబాద్‌ రైల్వేలైన్‌ కోసం ఎమ్మెల్యే ద్వారా ప్రతిపాదనలు తెసుకెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. ఇదిలా ఉండగా రక్తదాన శిబిరంలో 73 మంది రక్తదానం చేశారు. అంతకుముందు ధన్వాడ మండల కేంద్రంలోని సీఎన్‌ఆర్‌ ఘాట్‌ను సందర్శించి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయా కార్యక్రమాల్లో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గందె అనసూయ, నాయకులు బండి వేణుగోపాల్‌, శివకుమార్‌, బాల్‌రెడ్డి, సలీం, కోట్ల రవీందర్‌రెడ్డి, సదాశివారెడ్డి, ఎండీ గౌస్‌, సూర్యమోహన్‌, ఈదప్ప, సరాఫ్‌ నాగరాజ్‌, బండి రాజేశ్వరి, జొన్నల అనిత, నారాయణమ్మ, వరలక్ష్మీ పాల్గొనగా, ధన్వాడలో విండో చైర్మన్‌ వెంకట్రామ్‌రెడ్డి, చీరాల సుధాకర్‌రెడ్డి, కందనూర్‌ రహిమన్‌ఖాన్‌, చిట్టెం సత్యారెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, లక్ష్మయ్యగౌడ్‌, నరేందర్‌గౌడ్‌, అచ్చిబాబు, కెంచె నరేందర్‌, హరీశ్‌, బాబు, షాకీర్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 11:04 PM

Advertising
Advertising
<