పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
ABN, Publish Date - Jul 15 , 2024 | 11:08 PM
పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని జేఏసీ రాష్ట్ర నాయకుడు ఎండీ ఇక్బాల్ పాషా డిమాండ్ చేశారు.
- జేఏసీ రాష్ట్ర నాయకుడు ఎండీ ఇక్బాల్ పాషా
గద్వాల న్యూటౌన్, జూలై 15 : పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని జేఏసీ రాష్ట్ర నాయకుడు ఎండీ ఇక్బాల్ పాషా డిమాండ్ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడనాడాలన్నారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలు మంజూరు చేయాలన్నారు. నూతన పీఆర్‌సీ ప్రకటించాలని, నగదు రహిత ఆరోగ్యపథకం అమలు చేయాలని, స్పెషల్ టీచర్లుగా పనిచేసిన కాలానికి పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వాలని, ప్రతీ జిల్లాకు రెండు వెల్‌నెస్ సెంటర్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించారు. అంతకు ముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అబ్దుల్ బాబు, శంకర్ ప్రభాకర్, జేఏసీ భాగస్వామ్య సంఘాల నాయకులు రామన్‌గౌడు, స్వామిరెడ్డి, అబ్దుల్ రజాక్, ఏలియా, హనుమంతు, ఫరీదాబాను, చంద్రాములు, పౌల్, ప్రకాశం, జాఫర్, శామ్యూల్ ప్రభాకర్, ఇబ్రహీం, డేవిడ్, సుజ్ఞానం, నాగేశ్వర్‌రావు, భ్రమరాంబ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 15 , 2024 | 11:08 PM