నిందితుడిని కఠినంగా శిక్షించాలి
ABN, Publish Date - Aug 21 , 2024 | 11:09 PM
మహిళా డాక్టర్‌పై అత్యాచారం, హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ సరిత అన్నారు.
- వైద్య సిబ్బంది నిరసనకు జడ్పీ మాజీ చైర్‌పర్సన్, మునిసిపల్ చైర్మన్ మద్దతు
గద్వాల క్రైం, ఆగస్టు 21 : మహిళా డాక్టర్‌పై అత్యాచారం, హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ సరిత అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో డాక్టర్లు, వైద్య సిబ్బంది నిరసన కార్యక్రమానికి మాజీ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, మునిసిపల్ చైర్మన్ బీఎస్.కేశవ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ కోల్‌కతాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఈనెల ఎనిమిదిన మహిళా డాక్టర్‌పై అత్యాచారం, హత్యకు కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. మునిసిపల్ చైర్మన్ బీఎస్.కేశవ్ మాట్లాడుతూ వైద్యురాలి మృతికి కారణమైన నిందితులను బహిరంగంగా ఉరి తీయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లప్ప, పులిపాటి వెంకటేష్, నరహరిగౌడు, డీటీడీసీ నర్సింహులు, భాస్కర్‌యాదవ్, తుమ్మల నర్సింహులు, లక్ష్మన్, రంజిత్‌కుమార్, డాక్టర్లు, వైద్య సిబ్బంది ఉన్నారు.
Updated Date - Aug 21 , 2024 | 11:10 PM