బియ్యపు గింజలపై శ్రీరామనామం
ABN, Publish Date - Apr 15 , 2024 | 11:30 PM
అయిజ మండలం తుపతురాల గ్రామానికి చెందిన అర్చకుడు చక్రవర్తి ఆచార్యులు 35,000 బియ్యపు గింజలపై శ్రీరామనామాన్ని రాసి స్వామి భక్తిని చాటుకున్నాడు.
బియ్యపు గింజలపై శ్రీరామ నామం రాస్తున్న చక్రవర్తి, (ఇన్‌సెట్లో) బియ్యపు గింజలు
అయిజ, ఏప్రిల్ 15 : అయిజ మండలం తుపతురాల గ్రామానికి చెందిన అర్చకుడు చక్రవర్తి ఆచార్యులు 35,000 బియ్యపు గింజలపై శ్రీరామనామాన్ని రాసి స్వామి భక్తిని చాటుకున్నాడు. అదే గ్రామంలోని శ్రీరామాలయంలో అర్చకుడిగా పని చేస్తున్న ఆయన 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతీ సంవత్సరం రామనామాన్ని రాసిన బియ్యపు గింజలను సీతారామ కల్యాణోత్సవంలో అక్షింతలుగా విని యోగిస్తున్నారు. ఈ నెల 17న శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించనున్న కల్యాణోత్సవంలోనూ శ్రీరామ నామం రాసి ఉన్న బియ్యపు గింజలను అక్షింతలుగా ఉపయోగించనున్నారు.
Updated Date - Apr 15 , 2024 | 11:30 PM