ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇమాం ఖాసీం పీర్ల సవారీ

ABN, Publish Date - Jul 15 , 2024 | 10:57 PM

మండలంలోని చిన్నపొర్ల గ్రామంలో సోమవారం ఇమామే ఖాసీం అన్నదమ్ముల పీర్ల సవారీ వందలాది భక్తుల నడుమ ఉత్సహ భరితంగా సాగింది.

ఆడిపాడిన యువతీ, యువకులు

- వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆడిపాడిన యువతీ, యువకులు

ఊట్కూర్‌, జూలై 15 : మండలంలోని చిన్నపొర్ల గ్రామంలో సోమవారం ఇమామే ఖాసీం అన్నదమ్ముల పీర్ల సవారీ వందలాది భక్తుల నడుమ ఉత్సహ భరితంగా సాగింది. రాత్రి భక్తులు పీర్లలకు దట్టీలు, పూలు, వెండి గుర్రాలు, ఊయ్యాల వంటి కానుకలు సమర్పించారు. అలాగే ఊదు, చక్కెర, బెల్లం పానకాలను పీర్లకు ఇచ్చి ఫాతిహాలను చేశారు. రాత్రి ఆలై ఆడుతూ పాటలు పాడారు. ఓ పక్క వర్షం పడుతున్నా ఏమాత్రం లెక్క చేయకుండా తెల్లవారుజామున పీర్ల ఉత్సవాలు ప్రారంభం కాగా తాషాలు, డప్పుల దరువు మధ్య ఆలాయి ఆడుతూ, బొడ్డెమ్మలు వేస్తూ మధ్యామ్నం వరకు ఊరేగింపు జరిగింది. ఎడవెల్లి గ్రామం నుంచి చిన్నపొర్ల ఉత్సవాల్లో పాల్గొనే ఇమామే ఖాసీం అన్నదమ్మల వీడ్కోలు ఉత్కంఠ భరితంగా సాగింది. మహిళలు చనిపోయిన తమ కుటుంబీకులను తలుచుకుని కంటతడి పెట్టారు. అలాగే పెద్దజట్రం, పెద్దపొర్ల గ్రామంలో జరిగిన పీర్ల ఉత్సవాల్లో ప్రజలు ఉత్సహ భరితంగా పాల్గొన్నారు. పంచ్‌కమిటీ అధ్యక్షుడు ఇస్మాయిల్‌, ఉపాధ్యక్షుడు ఖాసీం, మాజీ ఉప సర్పంచ్‌ సంజప్ప, కోట్ల గోపాల్‌, ఆయా గ్రామాల ముస్లిం పెద్దలు మైనోద్దీన్‌, రహిమత్‌, హుస్సేన్‌, బందేనవాజ్‌, ఇర్షాద్‌, అల్తాఫ్‌, ముబీన్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2024 | 10:57 PM

Advertising
Advertising
<