కారు, బైక్ ఢీకొని ఒకరి మృతి
ABN, Publish Date - Jun 09 , 2024 | 11:09 PM
నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రం సమీపంలో హైదరాబాద్ -శ్రీశైలం ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం కారు, బైక్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి.
వెల్దండ, జూన్ 9: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రం సమీపంలో హైదరాబాద్ -శ్రీశైలం ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం కారు, బైక్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. మండల పరిధిలోని ఎంజీ కాలనీ తండాకు చెందిన రాత్లావత్ మంగ్య నాయక్(35) వెల్దండ నుంచి బైక్‌పై కల్వకుర్తి వైపునకు వెళ్తుండగా, శ్రీశైలం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు బైక్‌ను ఢీకొంది. దీంతో బైక్‌పై ఉన్న మంగ్యనాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న చత్తీ్‌సఘడ్‌కు చెందిన మోహన్‌సాహుకు స్వల్ప గాయాలయ్యాయి. మంగ్య హైదరాబాద్‌లో కారు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య రజిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్‌ఐ రవి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Updated Date - Jun 09 , 2024 | 11:09 PM