ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి

ABN, Publish Date - Jul 31 , 2024 | 11:22 PM

పిల్లలకు బాలామృతంతో పాటు పౌష్టికాహారం అందించి వారిని ఆరోగ్యవంతులను చేయాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ సూచించారు.

బ్లాక్‌బోర్డుపై చిన్నారితో అక్షరాలు రాయిస్తున్న కలెక్టర్‌ బీఎం సంతోష్‌

- కలెక్టర్‌ బీఎం సంతోష్‌

- శెట్టి ఆత్మకూరు అంగన్‌వాడీ కేంద్రం తనిఖీ

గద్వాల, జూలై 31 : పిల్లలకు బాలామృతంతో పాటు పౌష్టికాహారం అందించి వారిని ఆరోగ్యవంతులను చేయాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ సూచించారు. గద్వాల మండలం, శెట్టి ఆత్మకూర్‌ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల ఎదుగుదలను ఎప్పటికప్పుడు గుర్తించాలని సూచించారు. తక్కువ ఎదుగుదల ఉన్న పిల్లలను గుర్తించి ప్రత్యేకంగా పౌష్టికాహారం అందించాలన్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు అంగన్‌వాడీ కేంద్రాన్ని కచ్చితంగా నిర్వహించాలని ఆదేశించారు. మండల కేంద్రానికి ఒక అంగన్‌వాడీ కేంద్రానికి రంగులు వేయించి, ఆకర్షణీయమైన బొమ్మలను గీయించి అందంగా తీర్చిదిద్దినట్లు ఆయన తెలిపారు. కేంద్రాల ఆవరణ పరిశుభ్రంగా ఉండేట్లు చూసుకోవాలని, దోమలు రాకుండా కిటికీలకు జాలీలు వేయించాలని సూచించారు. కేంద్రంలో ఫ్యాన్‌, విద్యుత్‌ బల్బులను ఏర్పాటు చేయాలని, స్వచ్ఛమైన తాగు నీటిని చిన్నారులకు అందుబాటులో ఉంచాలని చెప్పా రు. ఆయన వెంట జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, పంచాయతీరాజ్‌ ఇంజనీర్లు దామోదర్‌, రాజేష్‌, బషీర్‌, ఎంపీడీవో ఉమాదేవి ఉన్నారు.

ఉత్తమ సేవలతోనే ఉద్యోగులకు గుర్తింపు

గద్వాల న్యూటౌన్‌ : ఉత్తమ సేవలు అందించడం ద్వారానే ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుందని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు. అదనపు కలెక్టర్‌ ముసిని వెంకటేశ్వర్లు ఉద్యోగ విరమణ సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయ న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముసిని వెంకటేశ్వర్లు 29 సంవత్సరాల పాటు ప్రజల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారన్నారు. ఎన్నికలు, పరీక్షల సమయంలో సమర్థవం తంగా పనిచేశారన్నారు. సాహిత్యంలో డాక్టరేట్‌ సాధించారని, ఆత్మవిశ్వాసంతో విధులు నిర్వర్తించారని గుర్తు చేశారు. శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో ప్రశాంత జీవనం గడపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ నర్సింగరావు, వనపర్తి అదనపు కలెక్టర్‌ నగేష్‌, డిప్యూటీ సీఈవో హమీద్‌, మహబూబ్‌నగర్‌ డీఆర్‌డీవో రవికుమార్‌, ఆర్డీవో రామ్‌చందర్‌, ఏవో వీరభద్రప్ప పాల్గొన్నారు.

రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వాలి

ధరూరు : పంట నష్టం వాటిల్లకుండా పత్తి విత్తనాల కంపెనీ ప్రతినిధులు ఎప్పటికప్పుడు రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ సూచించారు. బుధవారం ఆయన ధరూరు మండలం పెద్దపాడు గ్రామ పరిధిలో రైతులు సాగు చేసిన పత్తి పంటను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులు వ్యవసాయ దిగుబడులను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకునేలా, అర్హులందరికీ రైతుబంధు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతుల సాగు చేసిన పంటల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. రైతులు తమ పొలాల్లో బాలలను పనిలో పెట్టుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పత్తి పంట లాభసాటిగా ఉందా లేదా అని కలెక్టర్‌ రైతు రాజును అడగగా, ఆరు మాసాలకు పంట చేతికి వస్తుందని చెప్పారు. ఎకరాకు రెండు లక్షల రూపాయల ఆదాయం ఉంటుందని వివరించారు. కలెక్టర్‌ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్‌నాయక్‌, మండల వ్యవసాయాధికారి శ్రీలత, వ్యవసాయ విస్తీర్ణ అధికారి స్వరూప ఉన్నారు.

గద్వాల వైద్య కళాశాలకు ఎన్‌ఎంసీ అనుమతులు

జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాలకు నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ) అనుమతులు మం జూరైనట్లు కలెక్టర్‌ బీఎం సంతోష్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలను ఇటీవలే ఎన్‌ ఎంసీ బృందం పరిశీలించింది. అనంతరం అనుమ తులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - Jul 31 , 2024 | 11:22 PM

Advertising
Advertising
<