జగ్జీవన్‌రామ్ సేవలు చిరస్మరణీయం
ABN, Publish Date - Apr 05 , 2024 | 11:25 PM
ఉప ప్రధానిగా, కేంద్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా బాబూ జగ్జీవన్‌రామ్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని జిల్లా పరి షత్ చైర్‌పర్సన్ సరిత కొనియాడారు.
- జయంతి వేడుకల్లో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సరిత
- నివాళి అర్పించిన పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు
గద్వాల టౌన్, ఏప్రిల్ 5 : ఉప ప్రధానిగా, కేంద్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా బాబూ జగ్జీవన్‌రామ్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని జిల్లా పరి షత్ చైర్‌పర్సన్ సరిత కొనియాడారు. బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం పట్ట ణంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అంతకు ముందు ఉపాధ్యాయ, దళిత, ప్రజా సంఘాలు, కాం గ్రెస్ పార్టీ నాయకులతో కలిసి జిల్లా ఆస్పత్రి ఎదు రుగా ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ బండారి భాస్కర్, సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు మోహన్‌రావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి అచ్చనగౌడ్, న్యాయవాది మధుసూదన్‌బాబు, మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండీ ఇసాక్, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
- పట్టణంలోని బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహానికి ఉపాధ్యాయ, ప్రజా సంఘాల నాయకులు పూల మాల లు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ముని సిపల్ మాజీ వైస్ చైర్మన్ శంకర్, రిటైర్డ్ తహసీల్దార్ నాగరాజు, ప్రభాకర్, అశోక్, కన్నా, ఆర్.మోహన్, హనుమంతు, పరమేశ్వర్ రెడ్డి, యూనిస్ పాషా, సోమశేఖర్ రెడ్డి, గోపాల్, బహుజన రాజ్యసమితి నాయకులు వాల్మీకి, వినోద్, కోళ్ల హుసేన్, బీఎస్‌ఐ జిల్లా కన్వీనర్ కృష్ణ, తెలంగాణ ఉపాధ్యాయ సంఘం నాయకులు బుచ్చన్న, ప్రతాప్, పాల్వాయి లక్ష్మీనారా యణ, మేడికొండ ఈశ్వర్, ఆర్టీసీ డిపో ఉద్యోగులు ఇమ్మానుయేల్, వెంకటరాముడు, పుల్లూరు రాములు, రఘురాం, కృష్ణ, కిరణ్, లక్ష్మయ్య పాల్గొన్నారు.
జగ్జీవన్ రామ్ అందరికీ ఆదర్శం
గద్వాల న్యూటౌన్ : డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ ప్రతీ ఒక్కరికీ ఆదర్శమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ బాబర్, బీఆర్‌ఎస్ నాయకుడు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, గట్టు ఎంపీపీ విజయ్‌కుమార్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
సేవలు మరువలేనివి
అట్టడగు వర్గాల అభివృద్ధికి నిరంతరం పోరాడిన మహనీయుడు డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ అని, దేశానికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో ఎస్పీ సంక్షేమశాఖ ఆధ్వ ర్యంలో జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జగ్జీవన్‌రామ్ ఆశయాలు నేరవేరాలంటే ప్రతీ ఒక్కరు విద్యావంతులు కావాలని సూచిం చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అపూర్వచౌహాన్, ముసిని వెంకటేశ్వర్లు, ఏవో వీరభద్రప్ప, జడ్పీ సీఈవో కాంతమ్మ, బీసీ, ఎస్సీ సంక్షేమశాఖ అధికారి శ్వేతా ప్రియదర్శిని, డీఆర్‌డీవో నర్సింగరావు, స్వీప్ నోడల్ అధికారి రమేష్‌బాబు పాల్గొన్నారు.
బడుగుల అభ్యున్నతికి కృషి
ఎర్రవల్లి : బడుగుల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు బాబూ జగ్జీవన్ రామ్ అని నాగర్ కర్నూల్ మాజీ పార్లమెంట్ సభ్యుడు మందా జగన్నాఽథ్ అన్నారు. ఎర్రవల్లి మండలంలోని కొండేరు గ్రామంలోని అయన విగ్రహనికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మందా శ్రీనాథ్, పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, నాయకులు ఈరన్న, వెంకటేష్, యువరాజ్, రఘు పాల్గొన్నారు..
ఆదర్శ నేత బాబూ జగ్జీవన్‌రాం
వడ్డేపల్లి : స్వాతంత్య్ర సమరయోధుడిగా, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వారి సమానత్వం కోసం పోరాటిన ఆదర్శ నేత బాబూ జగ్జీవన్‌రాం అని కాం గ్రెస్ వడ్డేపల్లి మండల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా శుక్రవారం శాంతినగర్‌లోని పార్టీ కార్యాల యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జగన్ గౌడ్, పచ్చర్ల కుమార్, రేపల్లె కృష్ణ, కిశోర్, పక్కిరన్న, శీలన్న, విజయభాస్కర్, కాంట్రాక్టర్ ప్రేమరాజు, కాలువ అంజి పాల్గొన్నారు.
ఘనంగా జయంతి వేడుకలు
ఇటిక్యాల/ రాజోలి : బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సంద ర్భంగా ఇటిక్యాల మండల కేంద్రంలోని ఆయన విగ్రహా నికి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు భాస్కర్, న్యాయవాది యాకోబ్ పూలమా లలు వేసి నివాళి అర్పించారు. తహసీల్దార్ కార్యాల యంలో జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి ఆర్‌ఐ భీంసేన్ రావు పూల మాల వేసి నివాళి అర్పించారు. కార్య క్రమంలో లక్ష్మన్న, రంజిత్‌కుమార్, శేఖర్, నాగన్న, రమేష్, ప్రదీప్, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
రాజోలి మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్ర హం వద్ద బాబూ జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి మాజీ సర్పంచు గంగిరెడ్డి, మాజీ ఉప సర్పంచు గోపాల్, సీపీఎం మండల కార్యదర్శి విజయ్‌కుమార్ పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు లక్ష్మన్న, ఆటో యూనియన్ నాయకులు జయన్న, గ్రామ పెద్దలు గంగిరెడ్డి, గోపాల్, మూగన్న, రంగరాజు పాల్గొన్నారు.
Updated Date - Apr 05 , 2024 | 11:25 PM