కులాంతర వివాహ జంటలకు ప్రోత్సాహకం
ABN, Publish Date - Sep 11 , 2024 | 11:05 PM
కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు బుధవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రోత్సాహకాలను అందించారు.
- చెక్కులు అందించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
గద్వాల న్యూటౌన్, సెప్టెంబరు 11 : కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు బుధవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రోత్సాహకాలను అందించారు. గట్టు మండల పరిధిలోని ఆలూరు గ్రామానికి చెందిన శిల్ప, రమేష్, గద్వాల మండల పరిధిలోని బీరెల్లి గ్రామానికి చెందిన కవిత, అజయ్ దంపతులకు ప్రభుత్వం నుంచి మంజూరైన రూ. 3.50 లక్షల చెక్కులను ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ జంబు రామన్‌గౌడ, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా సంక్షేమాధికారి సరోజ, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన ఓబీసీ జిల్లా చైర్మన్
జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని బుధవారం ఓబీసీ జిల్లా చైర్మన్ ఎం.సీ.నల్లారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ జంబురామన్‌గౌడ, పీఏసీఎస్ చైర్మన్ తిమ్మారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీకాంత్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు రాజు, నాయకులు వేణుగోపాల్, ఈశ్వరయ్య, రాఘవేంద్రరెడ్డి, ఆనంద్‌రెడ్డి, కురుమన్న, గణేష్, ఆడ్వకేట్ ఆనంద్, కిరణ్ పాల్గొన్నారు.
Updated Date - Sep 11 , 2024 | 11:05 PM