ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నిప్పుల కొలిమి

ABN, Publish Date - Apr 26 , 2024 | 11:29 PM

భానుడు భగభగమండుతుండటంతో పాలమూరు నిప్పులకొలిమిలా మారుతోంది. రోజంతా జనం ఎండలకు తాళలేక అల్లాడిపోతున్నారు. పలు మండలాల్లో రహదారులు మఽధ్యాహ్నం వేళ నిర్మానుష్యంగా మారుతున్నాయి.

వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మండలంలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత

వనపర్తి అర్బన్‌/మహబూబ్‌నగర్‌/గద్వాల టౌన్‌/నారాయణపేట, ఏప్రిల్‌ 26: భానుడు భగభగమండుతుండటంతో పాలమూరు నిప్పులకొలిమిలా మారుతోంది. రోజంతా జనం ఎండలకు తాళలేక అల్లాడిపోతున్నారు. పలు మండలాల్లో రహదారులు మఽధ్యాహ్నం వేళ నిర్మానుష్యంగా మారుతున్నాయి. జిల్లాలో శుక్రవారం ఎండప్రచండానికి శుభకార్యాలకు వెళ్ళేవారు ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మండలంలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొత్తకోట 44.0, పెబ్బేరు 43.0, శ్రీరంగాపూర్‌ 42.8, చిన్నంబావి 42.1, ఆత్మకూరు 42.0, వనపర్తి, పెద్దమందడి 41.9, మదనాపూర్‌ 41.7, అమరచింత 41.6, గోపాల్‌పేట, ఘణపూర్‌ 41.5, వీపనగండ్ల 41.2, రేవల్లి 40.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండలంలో 44.2 డిగ్రీలు, బాలానగర్‌లో 43.5, మిడ్జిల్‌, మూసాపేటలో 43.2, అడ్డాకులలో 43.1, జడ్చర్లలో 42.3, మహబూబ్‌నగర్‌లో 41.3 డిగ్రీలు నమోదుకాగా, రాజాపూర్‌ మండలంలో అత్యల్పంగా 39.9 డిగ్రీలు నమోదైంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలంలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కల్వకుర్తిలో 43.4, కోడేరు, వెల్దండ, వంగూరు మండలాల్లో 42.5, అచ్చంపేటలో 42.2, ఉప్పునుంతలలో 42, పెద్దకొత్తపల్లి, లింగాల మండలాల్లో 41.9, నాగర్‌కర్నూల్‌లో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జోగుళాంబ గద్వాల జిల్లాని గద్వాల, వడ్డేపల్లిలో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా అలంపూర్‌లో 42.8 డిగ్రీలు, రాజోళిలో 42.5 డిగ్రీలు, కేటిదొడ్డిలో 42.3 డిగ్రీలు, ఇటిక్యాలలో 42.2 డిగ్రీలు, అయిజలో 41.7 డిగ్రీలు, మల్దకల్‌లో 41.6 డిగ్రీలు, ఉండవల్లిలో 41.4 డిగ్రీలు, మానవపాడులో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నారాయణపేట జిల్లా నర్వలో 42 డిగ్రీలు, కోస్గి, మక్తల్‌, కృష్ణలలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Updated Date - Apr 26 , 2024 | 11:29 PM

Advertising
Advertising