ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను పూర్తి చేయాలి

ABN, Publish Date - Jul 31 , 2024 | 11:05 PM

గత ప్రభుత్వ హయాంలో పెబ్బేరు మండలంలోని పాతపల్లి, గుమ్మడం గ్రామాలకు మంజూరైన డబుల్‌ బెడ్‌రూమ్‌లను బుధవారం మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి పరిశీలించారు.

గుమ్మడం గ్రామంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను పరిశీలిస్తున్న మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి

- మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి

- పాతపల్లి, గుమ్మడం గ్రామాల్లో అసంపూర్తి ఇళ్ల నిర్మాణాల పరిశీలన

పెబ్బేరు రూరల్‌, జూలై 31 : గత ప్రభుత్వ హయాంలో పెబ్బేరు మండలంలోని పాతపల్లి, గుమ్మడం గ్రామాలకు మంజూరైన డబుల్‌ బెడ్‌రూమ్‌లను బుధవారం మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి పరిశీలించారు. అప్పటి సీఎం కేసీఆర్‌ను ఒప్పించి గజ్వేల్‌ తరహాలో వనపర్తి జిల్లాలో అత్యధికంగా పాతపల్లికి 50, గుమ్మడంకు వంద డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు మంజూరు చేయించామన్నారు. అప్పట్లో నిధులు మంజూరయ్యాయని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో నిర్మాణాలు తప్ప కొత్త ప్రభుత్వంలో నిర్మాణాలు ఆగిపోయాయని ఆ యన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై తాను కలెక్టర్‌, డీపీఆర్వోతో చర్చించడం జరిగింద న్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అసంపూర్తిగా ఉన్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో పెబ్బేరు పట్టణ అధ్యక్షుడు దిలీప్‌రెడ్డి, నాయకులు గోవిందు, వెంకటయ్య, నందిమల్ల అశోక్‌ ఉన్నారు.

యువత నైపుణ్యంతో స్వయం ఉపాధి పొందాలి

పెబ్బేరు : యువత తమ నైపుణ్యంతో స్వయం ఉపాధి పొందుతూ పలువురికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. పెబ్బేరులోని బస్టాండ్‌ సమీపంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వనంరాములు కుమారుడు ప్రవీణ్‌కుమార్‌ ఏర్పాటు చేసుకున్న తులసిరాం ఫర్టిలైజర్స్‌ షాపును బుధవారం ఆయన ప్రారంభించి, మాట్లాడారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ఎద్దుల కరుణశ్రీ, వైస్‌ చైర్మన్‌ కర్రెస్వామి, దిలీప్‌కుమార్‌రెడ్డి, రాజశేఖర్‌ పలువురు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. అనంతరం పట్టణానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుడు నాగశేషి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకున్న నిరంజన్‌రెడ్డి వారి ఇంటికి వెళ్లి పరా మర్శించారు. మెరుగైన వైద్యం కోసం తన సహకారం ఉంటుందని, అధైర్యపడొద్దని అన్నారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి సన్మానం

వనపర్తి అర్బన్‌ : పట్టణానికి చెందిన కౌన్సిలర్‌ నాగన్నయాదవ్‌ కుమారుడు సుధీర్‌కుమార్‌ యాదవ్‌ ఇటీవలే నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి బుధవారం పట్టణంలోని తన నివాసంలో సుధీర్‌ను సన్మానించి, అభినందించారు. పట్టుదలతో పనిచేసి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వాకిటి శ్రీధర్‌, రహీం, నాగేంద్రం, కవిత, తోట శ్రీను తదితరులున్నారు.

Updated Date - Jul 31 , 2024 | 11:05 PM

Advertising
Advertising
<