ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వర్షాలకు ఆస్తి, ప్రాణ నష్టం జరగొద్దు

ABN, Publish Date - Jul 15 , 2024 | 11:08 PM

జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ ఆదేశించారు.

అధికారులతో మాట్లాడుతున్న ఇన్‌చార్జి కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌

- అధికారులు అప్రమత్తంగా ఉండాలి

- పాడుబడ్డ ఇళ్లలో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి

- ఇన్‌చార్జి కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, జూలై 15: జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ ఆదేశించారు. సోమవారం ప్రజావాణి హాల్‌ నుంచి వెబెక్స్‌ ద్వారా జిల్లా అధికారులు, తహసీల్దార్‌ లు, మండల అభివృద్ధి అధికారులు, మునిసిపల్‌ కమిషనర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సం దర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్‌ మాట్లాడుతూ... రానున్న రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఎక్కడ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుం డా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామాల్లో, మునిసిపాలిటీల్లో శిథిలావస్థకు చేరుకున్న మిద్దెలు ఉంటే గుర్తించి వెంటనే అందులో నివసిస్తు న్న కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల న్నారు. మురుగు కాలువలు శుభ్రం చేయించి ఓవర్‌ఫ్లో కాకుండా చూసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా చూసుకోవాలన్నారు. ఈగలు, దోమలు వ్యాప్తి చెంది అంటురోగాలు ప్రబలకుండా పారిశుధ్యంపై దృష్టి పెట్టాలన్నారు. ఎక్కడైనా పంట నష్టం జరిగితే వెంటనే నివేదిక సిద్ధం చేసి పంపించాలని వ్యవసాయ శాఖ అధికా రులను ఆదేశించారు. విద్యుత్‌ సమస్య లేకుండా చూసుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు ఆయన సూచించారు. కార్య క్రమంలో అదనపు కలెక్టర్‌ నగేష్‌, జిల్లా అధికారులు, తహసీల్దార్‌లు, ఎంపీడీవోలు, మునిసిపల్‌ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు

వనపర్తి రాజీవ్‌చౌరస్తా : ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరిం చడంలో అధికారులు అలసత్వం ప్రదర్శించవద్దని ఇన్‌చార్జి కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ ఆదేశించారు. సోమవారం ఉదయం ప్రజావాణి హాల్‌లో అదనపు కలెక్టర్‌ నగేష్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. పెద్దగూడెం గ్రామానికి చెందిన బీచుపల్లి దివ్యాంగుడైన తన కుమారుడు యాదగిరి కోసం ట్రై సైకిల్‌ ఇప్పించాలని కోరారు. స్పందించిన కలెక్టర్‌ వెంటనే సంక్షేమ శాఖ అధికారుల ద్వారా ట్రై సైకిల్‌ అందజేశారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 58 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పాఠశాల అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలి

వనపర్తి రాజీవ్‌చౌరస్తా : అమ్మ ఆదర్శ పాఠశాల పనులు త్వరగా పూర్తి చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ఇంజనీరింగ్‌ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులతో వెబెక్స్‌ ద్వారా అమ్మ ఆదర్శ పాఠశాల పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు చాలా పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయని, మిగిలిన వాటిని నెలాఖరు లోగా పూర్తి చేయించాలని సూచించారు. మిగిలిపోయిన పాఠశాలల పనుల పురోగాభివృద్ధిపై ఒక్కొక్కటిగా సమీక్ష నిర్వహించారు. పాఠశాలకు పెయింటింగ్‌ పనులు సైతం త్వరగా పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Updated Date - Jul 15 , 2024 | 11:08 PM

Advertising
Advertising
<