ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ప్లాస్టిక్‌ నిషేధం

ABN, Publish Date - Jun 06 , 2024 | 11:20 PM

అమ్రాబాద్‌ అభయారణ్యంలో ప్లాస్టిక్‌ వస్తువుల వాడకాన్ని క్రమేపీ తగ్గించడంపై అట వీ శాఖ అడుగులు వేస్తోంది.

రీసైక్లింగ్‌ కేంద్రంలో సేకరించిన ప్లాస్టిక్‌ వ్యర్థాలు

- అమ్రాబాద్‌ అభయారణ్యంలో కఠిన నిబంధనలు

- పెద్ద పులులు, ఇతర వన్యప్రాణులకు హాని కలుగకుండా చర్యలు

- ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్న అటవీశాఖ

మన్ననూర్‌, జూన్‌ 6: అమ్రాబాద్‌ అభయారణ్యంలో ప్లాస్టిక్‌ వస్తువుల వాడకాన్ని క్రమేపీ తగ్గించడంపై అట వీ శాఖ అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని ప్లాస్టిక్‌ ప్రీ జోన్‌గా ప్రకటించి, పలురకాల పర్యావరణ హిత కార్యక్రమాలను చేపడుతోంది. నల్లమల పులుల అభయారణ్య ప్రాంతంలో ప్లాస్టిక్‌ నిషేధించేందుకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తాజాగా జీవో జారీ చేశారు. ఆ ఆదేశాలను అమలు చేసేందుకు అధికారులు కసరత్తును ప్రారంభించారు.

ప్లాస్టిక్‌తో వన్యప్రాణులకు హాని..

అభయారణ్య ప్రాంతం 2,166 చదరవు కిలో మీటర్ల మేర విస్తరించి ఉంది. అడవిలో 25 పెద్ద పులులు, 170 చిరుత పులులు, జింకలు, సాంబర్లు, మనుబోతు, అడ వి పందులు, నెమళ్లు, మూషిక జింకలు, అడవి కోళ్లు, అడవి కుక్కలు, అడవిపిల్లి, ఎలుగుబంట్లు కలిపి 2000 లకు పైగా ఉన్నట్లు అటవీశాఖ నివేదికలు చెబుతున్నాయి. ఇటీవల పెద్ద పులులు, చిరుతల సంఖ్య పెరి గింది. పెద్ద పులులకు ఆహారం కోసం సరిపడా జంతువుల సంఖ్య ఉందా?.. లేకుంటే ఎంత మేర పెంచాలో తెలుసుకునేందుకు మే నెలలో మూడు రోజు ల పాటు అన్ని బీట్లలో ఎకలాజికల్‌ సర్వే చేపట్టారు. ప్లాస్టిక్‌ వలన వన్యప్రాణులకు ఎంతో ప్రాణహా ని ఉందని అటవీ అధికారులు గుర్తించారు. అడవి గుండా ఉన్న రహదారులు దాటే క్రమంలో పర్యాటకులు ప్లాస్టిక్‌ వస్తువులను, నీళ్ల సీసాలను ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై వదిలివేయడం వలన శాకాహార జంతువులైన జింకలు, సాంబారు, కణితి వంటివి వాటిని తిన డం వల్ల జీర్ణకోశ సమస్యలు వచ్చి.. ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నట్లు గుర్తించారు. అందుకే ప్లాస్టిక్‌ నిషేధాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. అమ్రాబాద్‌ అడవుల్లో ప్లాస్టిక్‌ నిషేధానికి ఇప్పటికే పలు రకాల కార్యక్రమాలకు అధికారులు శ్రీకారం చుట్టా రు. అమ్రాబాద్‌ మండలంలోని మన్ననూరు, మద్దిమడుగు, దోమలపెంట వరకు రహదారులపై పర్యాటకులు ప్లాస్టిక్‌ బాటిళ్లు, ఇతర తినుబండారాల కవర్లను వదిలి వెళ్తున్నారు. వాటిని నిత్యం ఒక దగ్గరికి చేర్చేందుకు అటవీ శాఖ స్థానికంగా ఉండే ఎనిమిది మంది సిబ్బందిని నియమించింది. ఈ వ్యర్థాలను మన్ననూరు వద్ద ఉన్న ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ కేంద్రానికి చేర్చుతారు. అక్కడి సిబ్బంది ప్లాస్టిక్‌ వ్యర్థాలను వేరుచేసి, రీసైక్లింగ్‌ యంత్రంలో వేసిన తర్వాత కట్టలు కట్టి, హైదరాబాద్‌లోని సెంటర్‌కు తరలిస్తారు. ఈ సిబ్బంది వేతనాల కోసం ఎనిమి దేళ్లుగా మన్ననూరు, దోమలపెంట చెక్‌పోస్టుల వద్ద అటవీశాఖ టోల్‌గేట్లను ఏర్పాటు చేసింది. పర్యాటకుల వాహనాల నుంచి మెయింటెనెన్స్‌ చార్జీల రూపేణ టోల్‌ ఫీజులను వసూలు చేసి, సిబ్బందికి వేతనాలు చెల్లిస్తున్నారు. ప్లాస్టిక్‌ సంచు లు, ప్లాస్టిక్‌ ప్లేట్ల స్థానంలో ప్రత్యామ్నాయంగా జనపనార సంచులు, పర్సులు, కూరగాయల బ్యాగులు, అడవిలో లభించే మార్పటాకులతో పర్యావరణహిత టిఫిన్‌, భోజనం ప్లేట్ల తయారీ కేంద్రా న్ని మన్ననూరు చెక్‌పోస్టు వద్ద అటవీశాఖ నిర్వహిస్తోంది. సఫారీ టూర్‌కు వచ్చిన పర్యాటకులకు ఈ పర్యావరణ హిత వస్తువుల వాడకంపై అవగాహన కల్పిస్తున్నారు. మున్ముందు పావు, అర లీటరు ప్లాస్టిక్‌ నీటి బాటిళ్లు మన్ననూరు నుంచి తీసుకెళ్లకుండా నిషేధం విధించి, వాటి స్థానంలో ప్రత్యామ్ర్నాయ ఏర్పాట్లు చేసేందుకు అధికారులు ఉన్నతాధికారులతో సమాలోచనలు చేస్తున్నారు.

Updated Date - Jun 06 , 2024 | 11:20 PM

Advertising
Advertising