మీ ఊర్లో జ్వరాలు ఉన్నాయా?
ABN, Publish Date - Aug 31 , 2024 | 11:57 PM
ఏమ్మా...!మీ ఊర్లో జ్వరాలు ఉన్నాయా... ఏ ఊరు మీది... ఆశా కార్యకర్తలు వస్తున్నారా ఇళ్లకి.. డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారా?’’ అంటూ కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన రోగులను, మహిళలను ఆరా తీశారు. శనివారం ఆయన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భగా క్యాజువాలిటి, ఫార్మసీ, వార్డులు పరిశీలించారు. గర్భిణు
ఖమ్మం కలెక్టరేట్, ఆగస్టు 31:‘ఏమ్మా...!మీ ఊర్లో జ్వరాలు ఉన్నాయా... ఏ ఊరు మీది... ఆశా కార్యకర్తలు వస్తున్నారా ఇళ్లకి.. డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారా?’’ అంటూ కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన రోగులను, మహిళలను ఆరా తీశారు. శనివారం ఆయన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భగా క్యాజువాలిటి, ఫార్మసీ, వార్డులు పరిశీలించారు. గర్భిణులు, వైద్య పరీక్షలకు వచ్చిన గర్బవతులు, రోగుల సహాయకులతో ఆసుపత్రిలో అందుతున్న ేసవల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగుల నమోదుకు కావాల్సిన కంప్యూటర్లు, ల్యాప్‌ట్యా్‌పలు ఉన్నాయా లేవా అని అడిగారు. ఆ తర్వాత డెలివరీ రిజిష్టర్లను తనిఖీ చేశారు. ఈడీడీల వివరాలు అడిగి, రెగ్యులర్‌గా పర్యవేక్షణ చేస్తున్నది, లేనిది తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గైనకాలజిస్టు వైద్యులతో కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల్లో తరచుగా పీసీవోడీకి సంబందించిన వ్యాధులు తలెత్తడానికి గల కారణాలేంటని ప్రశ్నించారు. దీనికి వైద్యులు పిల్లలో శారీరక శ్రమ లేకపోవడం, చిన్నారులకు ఆటలు, వ్యాయామం లాంటివి గతంలో మాదిరిగా లేకపోవడంతో ఇలాంటి వ్యాధులు బారిన పడుతున్నారంటూ చెప్పడంతో.. ఏమ్మా మీ దగ్గరికే తల్లులు వస్తున్నారు.. మహిళలు వస్తున్నారు. వాళ్లకి ఇలా కౌన్సెలింగ్ ఇవ్వండి.. పిల్లలను ఆటలాడే విధంగా చూడాలని శారీరక శ్రమ పడేలా చేయాలని వివరించాలంటూ ఉద్భోదించారు. ఈ సందర్భంగా ఓ చిన్నారిని కలెక్టర్ ఎత్తుకుని మురిసిపోయారు. ప్రభుత్వ ఆస్పత్రిల్లో డెలివరీలు పెంచాలని, గర్భిణులకు రెగ్యులర్ చెకప్ అయ్యేలా చూడాలని తెలిపారు.స్కానింగ్ కేంద్రాలను పరిశీలించి, ఎంతమంది టెక్నీషియన్లు ఉన్నది, ఎన్ని పరీక్షలు చేపడుతున్నది అడిగి తెలుసుకున్నారు. రేడియాలజిస్టులు లేకపోవడంతో ఇబ్బంది ఉంటోందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్‌కుమార్ కలెక్టర్‌కు వివరించారు. ఆసుపత్రిలో సమస్యలు, కావాల్సిన సౌకర్యాలకు తక్షణమే ప్రతిపాదనలు పంపాలన్నారు. ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉంటూ వచ్చే వారితో ప్రేమపూర్వకంగా మెలగాలని, వారికి మెరుగైన సేవలు అందించాలన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో జర్వాలతో బాధపడేవారికి ఒక ప్రత్యేక వార్డు ఏర్పాటుచేసి, చికిత్స అందించాలన్నారు. వార్డులో 24 గంటలు వైద్యాధికారి అందుబాటులో ఉండి, ప్రత్యేక శ్రద్థ తీసుకొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణులు సాధారణంగా వైద్యపరీక్షలకు వచ్చిన వారికి ఒత్తిడిని జయించే శక్తి కల్పించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెడిటేషన రూమ్‌ను కలెక్టర్ సందర్శించారు. కాన్ఫుల వార్డు, ఐసీయూ, ఇన్ బోర్న్ యూనిట్, నవజాత శిశు సంరక్షణ కేంద్రం, అమృతం తల్లిపాల కేంద్రం, తల్లిపాలను సేకరించి, నిల్వ ఉంచే కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ పర్యటన సందర్భంగా శిక్షణ సహాయ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్, ఆర్‌ఎంవో డాక్టర్.రాంబాబు, వినాయక్ రాథోడ్ వైద్యాధికారులు తదితరులున్నారు.
Updated Date - Aug 31 , 2024 | 11:58 PM