ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బరిలో పొంగులేటి వియ్యంకులు

ABN, Publish Date - Apr 27 , 2024 | 06:25 AM

లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్న ఆ ఇద్దరు అభ్యర్థులు వేర్వేరు పార్టీలకు చెందినవారు. అయితే.. ఆ ఇద్దరూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వియ్యంకులు కావడం విశేషం.

  • ఖమ్మంలో మంత్రి వియ్యంకుడు రఘురాంరెడ్డి

  • మెదక్‌లో తమ్ముడి వియ్యంకుడు వెంకట్రామిరెడ్డి

ఖమ్మం, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మంత్రికి స్వయాన వియ్యంకుడైన రామసహాయం రఘురాంరెడ్డి ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున బరిలో నిలిచారు. మరోవైపు.. మెదక్‌ పార్లమెంటు స్థానం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ ఐఏఎస్‌ పి.వెంకట్రామిరెడ్డి.. మంత్రి పొంగులేటి సోదరుడైన ప్రసాదరెడ్డికి వియ్యంకుడు. కాగా, మంత్రి పొంగులేటి తన వియ్యంకుడు రఘురాంరెడ్డికి టికెట్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

అలాగే మొదటి నుంచీ కాంగ్రెస్‌ కుటుంబం కావడం, రఘురాంరెడ్డి తండ్రి సురేందర్‌రెడ్డి కూడా ఎమ్మెల్యేగా, ఎంపీగా పలుసార్లు పార్టీ నుంచి గెలవడం.. ఆయనకు అనుకూలాంశంగా మారింది. కాగా, ఖమ్మం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ప్రసాదరెడ్డి చివరివరకు ప్రయత్నించినా.. అధిష్ఠానం రఘురాంరెడ్డికి అవకాశం ఇచ్చింది. దీంతో ప్రసాదరెడ్డి పోటీ నుంచి తప్పుకొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 06:25 AM

Advertising
Advertising