ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Khammam: బీఆర్ఎస్‏కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌ గూటికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం?

ABN, Publish Date - Feb 18 , 2024 | 11:08 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు(BRS MLA Tellam Venkatarao) త్వరలోనే కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు తెలుస్తోంది.

ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు(BRS MLA Tellam Venkatarao) త్వరలోనే కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హైదరాబాద్‌లో చర్చలు జరిగినట్లు కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ నియోకవర్గాలుండగా.. భద్రాచలంలో మాత్రమే బీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. గతంలో బీఆర్‌ఎ్‌సలోనే ఉన్న తెల్లం వెంకట్రావు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రస్తుత రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి కాంగ్రెస్ లో చేరారు. అయితే భద్రాచలంలో కాంగ్రెస్‌ నుంచి అప్పటికి సిటింగ్‌ ఎమ్మెల్యేగా పొదెం వీరయ్య ఉండడంతో తెల్లంకు టికెట్‌ విషయంలో భరోసా లభించలేదు. అదే సమయంలో బీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ ఆఫర్‌ రావడంతో వెంకట్రావు మళ్లీ బీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి అనుచరుడిగా ఉన్న వెంకట్రావు అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెంటనే కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరగగా.. ఆయన కొట్టిపారేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి రూ.10కోట్లు నిధులు కేటాయించింది. ఆ నిధుల వినియోగంపై జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రులకు అధికారం కల్పించింది. దీనికితోడు త్వరలో మార్కెట్‌ కమిటీలతో పాటు పలు నియామక కమిటీలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ఈ నేపథ్యంలోనే తెల్లం కాంగ్రెస్‌ గూటికి చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది. జిల్లా మంత్రి పొంగులేటితో పాటు మరో రాష్ట్ర మంత్రితో మంతనాలు సాగించి పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. లోక్‌సభ ఎన్నికలకు ముందే వెంకట్రావు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని సమాచారం. అయితే తెల్లం వర్గీయులు మాత్రం తమ ఎమ్మెల్యే బీఆర్‌ఎ్‌సలోనే ఉంటారని, కాంగ్రెస్ లో చేరే అవకాశం లేదని చెబుతున్నారు.

Updated Date - Feb 18 , 2024 | 11:08 AM

Advertising
Advertising