జోరుగా జర్ధా దందా
ABN, Publish Date - May 23 , 2024 | 12:50 AM
జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జర్ధా అక్రమ వ్యాపారం జోరుగా జరుగుతోంది. అదనపు ఆదాయమే లక్ష్యం గా పలువురు అక్రమ వ్యాపారులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతు న్నారు.
- ఉత్తర ప్రదేశ్ నుంచి దిగుమతి
- గుట్టు చప్పుడు కాకుండా విక్రయాలు
- జగిత్యాల కేంద్రంగా ఇతర జిల్లాలకు తరలింపు
- బ్లాక్‌లో అమ్మకాలతో వ్యాపారులకు కాసులు
- యేటా రూ. అర కోటికి పైగా అక్రమ వ్యాపారం
జగిత్యాల, మే 22 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జర్ధా అక్రమ వ్యాపారం జోరుగా జరుగుతోంది. అదనపు ఆదాయమే లక్ష్యం గా పలువురు అక్రమ వ్యాపారులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతు న్నారు. గుట్టు చప్పుడు కాకుండా దందా కొనసాగిస్తూ రూ. లక్షలు ఆర్జిస్తు న్నారు. జిల్లా కేంద్రమైన జగిత్యాలతో పాటు ప్రధాన పట్టణాలయిన కో రుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి తదితర ప్రాంతాల్లో అక్రమ జర్ధ వ్యా పారం మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తోంది. జర్థ...చాలామంది ఆకు, సున్నం, వక్కతో పాటు దీన్ని వినియోగించడానికి అలవాటు ప డ్డారు. పల్లె పట్నం తేడాలేకుండా ప్రధానంగా మహిళలు ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇప్పుడిదే కొందరు వ్యాపారులకు కాసులు కురిపి స్తోంది. అధికారుల కళ్లు గప్పి దందా కొనసాగిస్తూ రెండుచేతులా సంపాది స్తున్నారు.. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడం, అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం వారికి కలిసొస్తోంది.
కిక్‌ను సొమ్ము చేసుకుంటూ...
జర్ధ వినియోగానికి అలవాటు పడి మత్తులో తూగుతున్న వ్యక్తుల అవ సరాలను ఆసరగా చేసుకొని పలువురు వ్యాపారులు సమ్ము చేసుకుం టున్నారు. పొగాకు సంబంధిత ఉత్పత్తి కావడంతో మన రాష్ట్రంలో జర్థ వి క్రయాలపై నిషేదముంది. సుదీర్ఘకాలంగా చాలామంది అలవాటు పడి ఉండడంతో వినియోగాన్ని ఆపేసే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో బ్లాక్‌లోనైనా కొనుగోలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. బాహాటంగా వీటిని విక్రయించేందుకు అవకాశం లేకపోవడంతో దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు వ్యాపారులు వినియోగదారులను అందినకాడికి దోచుకుంటున్నా రు. సర ఫరా లేదంటూ కృత్రిమ కొరతను సృష్టిస్తూ ఒక్కో డబ్బాను గరిష్ట ధరకు మించి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు.
యేటా సుమారు రూ. అరకోటికి పైగా వ్యాపారం...
జిల్లాలో జర్ధా డబ్బాలను అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుం టున్నారు. 40 గ్రాముల జర్ధా డబ్బా ధర రూ. 35 నుంచి రూ. 40 వరకు ఉంటుంది. దీనిపై 24 శాతం జీఎస్టీ ఉంది. ఒక్కో డబ్బాను రూ. 100 నుం చి రూ. 120 వరకు విక్రయిస్తున్నారు. జిల్లాలోనే ప్రతి నెలా సగటున 20 వేల డబ్బాలు విక్రయమవుతాయిని అంచనా ఉంది. ఈ లెక్కన బాహాటం గా ప్రతి నెలా సుమారు రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు అద నంగా వ్యాపారులు సంపాదిస్తున్నట్లు స్పష్ట మవుతోంది. ఈ లెక్కన యే డాది సుమారు రూ. అర కోటి పైగా అక్రమ వ్యాపారం సాగుతోంది. బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరకు విక్రయించే విషయాన్ని పక్కన పెడితే ప్రభుత్వా నికి చెల్లించాల్సిన జీఎస్టీ సైతం ఎగ్గొడుతుండటం గమనార్హం. జిల్లా వ్యా ప్తంగా సుమారు 50 మంది వరకు హోల్‌సేల్ వ్యాపారులు, వందల సం ఖ్యలో చిల్లర వ్యాపారులు జర్ధ విక్రయాలు జరుపుతున్నట్లు అంచనా ఉంది.
అదనపు ఆదాయమే లక్ష్యంగా....
గతంలో జగిత్యాల పట్టణంలోని పలు దుకాణాల్లో మహరాష్ట్రలో విక్ర యించాల్సి గోదుమపిండి ప్యాకెట్లను దొడ్డిదారిన మన ప్రాంతానికి తీసుకొ చ్చి గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నట్లు ఆహార భద్రతా అధికారుల తనిఖీల్లో స్పష్టమైంది. వాహనంలో తరలిస్తుండడంతో పాటు ప్రత్యేక గోదా ములలో నిల్వ ఉంచిన ప్యాకెట్లను అధికారులు పట్టుకొని పోలీసులకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ నుంచి ద్విచక్ర వాహనాలపై పెద్ద ఎత్తున గంజాయి తరలించి విక్రయిస్తు న్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. అదేవిధంగా ఛత్తీస్‌గఢ్, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి వస్తున్న గంజాయిని సైతం అధికారులు పట్టుకు న్నారు. జగిత్యాల కేంద్రంగా ఓ ప్రైవేటు వైద్యుడు నార్కోటిక్ డ్రగ్స్‌ను హై ద్రాబాద్, ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తుండగా డ్రగ్స్ ఇన్స్‌పెక్టర్లు పెద్ద ఎ త్తున పట్టుకున్నారు. సదరు వైద్యుడిపై కేసు నమోదు చేశారు. జగిత్యాల పట్టణంలోని ఓ దుకాణంలో ఓ పేరుమోసిన కంపెనీని పోలిఉన్న నకిలీ పైప్‌ల విక్రయాలను గుర్తించి కేసు నమోదు చేశారు. జగిత్యాలకు చెందిన ఓ అక్రమ వ్యాపారి విదేశీ మద్యం తీసుకవచ్చి అక్రమంగా విక్రయిస్తున్న వ్యవహారాన్ని ఎక్సయిజ్ పోలీసులు గుట్టురట్టు చేసిన సంఘటన సైతం ఉంది. జగిత్యాల కేంద్రంగా జిల్లాలో కల్తీ నూనె వ్యాపారం, నెయ్యి వ్యాపా రం, గుట్కా, గోదుమ పిండి తదితర వ్యాపారాలను నిబంధనలకు విరు ద్దంగా చేపడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జర్ధ వ్యా పారం కూడా అదే రీతిలో పన్నులు చెల్లించకుండా, గుట్టుగా విక్రయిస్తున్న ట్లు తెలుస్తోంది. కొందరు వ్యాపారులు సులభంగా అధిక ఆదాయం సం పాదించడమే లక్ష్యంగా ఇలా పక్కదారి పడుతున్నారని ప్రచారం జరుగు తోంది. తమ స్వార్థం కోసం ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతుండటం గమనార్హం.
జగిత్యాల కేంద్రంగా...
సాధారణంగా ఉత్తర్‌పదేశ్ నుంచి జర్థ ఎక్కువగా దిగుమతి అవుతుం టుందని వ్యాపారవర్గాలు పేర్కొంటున్నాయి. కొందరు వ్యాపారులు ఇక్కడ తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. జీఎస్టీ చెల్లింపులేవీ లెకుండా దొడ్డిదా రిన ఉత్తర్‌ప్రదేశ్ నుంచి జగిత్యాలకు వీటిని సరఫరా చేస్తున్నారనే వాదన లు ఉన్నాయి. ఇందుకోసం ట్రాన్స్ పోర్ట్ వాహనాలు, కార్గో బస్సులు ట్రావె ల్స్ బస్సులను వినియోగించుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా వచ్చిన జర్ధ డబ్బాలను జగిత్యాల నుంచి నిర్మల్, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి తదితర జిల్లాలకు ఆటోలు, ఇతరత్రా వాహనాల్లో ఎవరికీ అనుమానం రాకుండా కావాల్సిన వ్యాపారులకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
దందాకు పెద్దల అండ...
జిల్లాలో కొనసాగుతున్న అక్రమ జర్ధ దందాకు రాజకీయ పెద్దల అండ దండలు అందుతున్నట్లు ప్రచారం ఉంది. రాజకీయ ముసుగులో అక్రమ వ్యాపారాలను కొనసాగించడానికి పలువురు ప్రయత్నిస్తున్నారు. వ్యాపార సంబంధాలు కలిగియున్న పలువురు వ్యక్తులు అధికార పార్టీ ముసుగును కప్పుకొని తమ దందాలను మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లేలా వ్యవహరిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీలో నాయకులుగా చలామణి అయిన జిల్లా కేంద్రానికి చెందిన కొం దరు ఇటీవల రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికా రంలోకి రావడంతో హఠాత్తుగా ఆ పార్టీలో చేరిపోయారు. తాము నిర్వ హించే గుట్కా, జర్ధా, మద్యం, తినుబండారాలకు వినియోగించే నాసిరకం వస్తువులు, రేషన్ బియ్యం క్రయ విక్రయాలకు పోలీసు, టాస్క్‌ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ తదితర సంబందిత అధికారులు అడ్డురాకుండా ఉండడానికే రాజకీ య ముసుగు కప్పుకుంటున్నారని బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తు న్నాయి. ఇలా పలువురు వ్యాపారులకు పెద్దల అండదండలు అందుతుండ డంతో చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనుకాడుతున్నారన్న ప్రచారం ఉంది.
అంతంతమాత్రంగానే తనిఖీలు...
ప్రజారోగ్యంతో ముడిపడిన అంశాలే కావడంతో....క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరు అనుమానాలకు తావిస్తోంది. కట్టుదిట్టంగా తనిఖీలు చేపట్టకపోవడంతోనే ఈ తరహా వ్యాపారం యథేచ్చగా కొనసాగుతోందనే విమర్శలొస్తున్నాయి. ఆహార భద్రత, తూనికలు, కొలతలు, పోలీసు, రెవెన్యూ, విజిలెన్స్ ఇలా వివిధ శాఖల అధికారులు సోదాలు చేసి నిబంధనలకు విరుద్దంగా ఉన్న వ్యాపారాలను అడ్డుకట్ట వేసే అవకాశమున్నా ఆ దిశగా పకడ్భందీ చర్యలు కనిపించడం లేదు. ఫలితంగా వ్యాపారులు తమ దందా యధేచ్చగా కొనసాగిస్తున్నారు.
Updated Date - May 23 , 2024 | 12:50 AM