ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎంపీగా గడ్డం వంశీని గెలిపించండి

ABN, Publish Date - May 08 , 2024 | 12:04 AM

కాంగ్రెస్‌ పార్లమెంట్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ వాకర్స్‌, క్రీడాకారులను కోరారు.

కళ్యాణ్‌నగర్‌, మే 7: కాంగ్రెస్‌ పార్లమెంట్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గారికి భారీ మెజార్టీతో గెలిపించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ వాకర్స్‌, క్రీడాకారులను కోరారు. మంగళవారం గోదావరిఖని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో వాకర్స్‌ను, క్రీడాకారులను కలుస్తూ కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. దివంగత కాకా వెంకటస్వామి మనుమడు, కాంగ్రెస్‌ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గారికి చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజలకు సమస్య వచ్చినా నాకు తెలుపగలరని, అదేవిధంగా కాంగ్రెస్‌ పార్టీ అమల్లోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలలో ఐదు పథకాలు అమలు చేయడం జరిగిందని, పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. గత పాలకులు కమీషన్ల కోసం ఇతర ప్రాంతాలకు సింగరేణి నిధులు ఇచ్చారని, ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా మన ప్రాంతాన్ని పూర్తి స్థాయి అభివృద్ధి చేయిస్తానన్నారు. ఓసీపీలను అడ్డుకునేందుకు కుర్చీ వేసుకొని కూర్చుంటానని చెప్పిన కేసీఆర్‌ ఈ ప్రాంతాన్ని ఓసీపీలతో బొందల గడ్డ చేశారని, కేసీఆర్‌ ముక్కు భూమికి రాసి ఈ ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఎన్నికల తరువాత రూ.36 కోట్లతో లక్ష్మీనగర్‌ అభివృద్ధి కార్యక్రమం మొదలుపెడతామని, రూ.15కోట్లతో స్టేడియం అభివృద్ధి చేస్తామని మక్కాన్‌సింగ్‌ తెలిపారు. మే 13న జరిగే ఎన్నికల్లో గడ్డం వంశీకృష్ణ చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, వివిధ విభాగాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2024 | 12:04 AM

Advertising
Advertising