ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

స్థానిక సంస్థలను బలోపేతం చేస్తాం

ABN, Publish Date - Jul 05 , 2024 | 12:34 AM

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం కల్పించి బలోపేతం చేస్తామని ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాల మండలంలోని ఎంపీపీ, ఎంపీటీసీలతోపాటు పాలకవర్గం ఐదేళ్లకాలం పూర్తికావ డంతో జగిత్యాల ఎంపీపీ కార్యాలయంలో గురువారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి

జగిత్యాలరూరల్‌, జూలై 4: స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం కల్పించి బలోపేతం చేస్తామని ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాల మండలంలోని ఎంపీపీ, ఎంపీటీసీలతోపాటు పాలకవర్గం ఐదేళ్లకాలం పూర్తికావ డంతో జగిత్యాల ఎంపీపీ కార్యాలయంలో గురువారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పదవీకాలం పూర్తిచేసుకున్న ఎంపీటీసీలను ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి శాలువాతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో ఎంపీటీసీలకు ప్రాధాన్యం కల్పించడానికి కృషి చేస్తానని అన్నారు. గ్రామపంచాయతీల్లో సర్పంచులు అభివృద్ధి పనులు చేసి బిల్లులు రాకపోవడంతో ఆర్థికంగా చితికిపోయారని వెంటనే వారి బిల్లులు విడుదల చేసేవిధంగా ప్రభుత్వానికి నివేదిస్తానని తెలిపారు. పదవిలో ఉన్నాలేకున్నా ప్రజాసేవ చేసినప్పుడే ప్రజాప్రతినిధులకు గుర్తింపు వస్తుందన్నారు. గ్రామాల్లో ప్రొటోకాల్‌కే పరిమితమయ్యామని పలువురు ఎంపీటీసీలు తన దృష్టికి తీసుకువ చ్చారని ఎంపీటీసీలకు నిధులు, నియామకాల్లో ప్రాధాన్యం కల్పించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేస్తానని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో జగిత్యాల మండల ప్రత్యేకాధికారి రాజ్‌కుమార్‌, ఎంపీపీ ములాస పు లక్ష్మీ, జడ్పీటీసీ మహేష్‌, ఎంపీడీవో విజయలక్ష్మీ, తహసీల్దార్‌ వరందన్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీలు శేఖర్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎంపీటీసీలు, మండల పరిషత్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 12:35 AM

Advertising
Advertising