ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కులగణనపై కార్యాచరణ ప్రకటిస్తాం

ABN, Publish Date - Jul 15 , 2024 | 11:59 PM

రాష్ట్రంలో కులగణనపై కార్యాచరణ ప్రకటిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సోమవారం నగరంలోని శాతవాహన యూనివర్సిటీలో వనమహోత్సవ కార్యక్రమం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కుల గణనపై ఇప్పటికే జీవో జారీ చేశామని, బిహార్‌లో ఎలా చేశారనే విషయంపూ స్టడీ చేస్తున్నామన్నారు. ఎన్నికల కోడ్‌ వల్ల జాప్యం జరిగిందన్నారు.

కరీంనగర్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్రంలో కులగణనపై కార్యాచరణ ప్రకటిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సోమవారం నగరంలోని శాతవాహన యూనివర్సిటీలో వనమహోత్సవ కార్యక్రమం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కుల గణనపై ఇప్పటికే జీవో జారీ చేశామని, బిహార్‌లో ఎలా చేశారనే విషయంపూ స్టడీ చేస్తున్నామన్నారు. ఎన్నికల కోడ్‌ వల్ల జాప్యం జరిగిందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు కుల గణనపై, రాహుల్‌గాంధీ చెప్పినట్లు బలహీన వర్గాలతోపాటు ఇతర వర్గాలకు న్యాయం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రెండు మూడు రోజుల్లో కులగణనపై కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల తీర్పుతో అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్‌ఎస్‌, బీజేపీ కాంగ్రెస్‌ ప్రభుత్వం మనుగడ సాగించదని, కూలిపోతుందని ప్రకటించడం ఎంత వరకు సమంజసమన్నారు. ప్రభుత్వాలను కూల్చడమే రాజనీతా అని ప్రశ్నించారు. వారు కూల్చిన ప్రభుత్వాల్లోని ఎంత మంది శాసన సభ్యులతో రాజీనామాలు చేయించారన్నారు. ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర వారిదే అన్నారు. తాము కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌చేస్తే వారి కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ మిగిలే వారు కాదన్నారు. అధికారం చేపట్టిన వెంటనే కూల్చుతామని ఆ రెండు పార్టీలు ప్రకటనలు చేశాయన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజామద్ధతుతో గెలిచిన ప్రభుత్వాన్ని కూల్చుతామనడంఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వారు కూల్చుతామంటే మేము నిలబెడతామని శాసన సభ్యులు కాంగ్రెస్‌లో చేరుతున్నారన్నారు. పార్టీ ఫిరాయింపులకు కాంగ్రెస్‌పార్టీ పూర్తి వ్యతిరేకమన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును కాపాడుకునే బాధ్యత తమపై ఉందన్నారు. ఇక్కడి పార్లమెంట్‌ సభ్యుడు సైతం ప్రభుత్వం కూలుతుందని అనలేదా అని ప్రశ్నించారు. కేటీఆర్‌కు మాట్లాడే హక్కు లేదని, బీఆర్‌ఎస్‌లో చేరిన శాసన సభ్యుడిని రాజీనామా చేయించకుండా మంత్రిని చేయలేదా అని ప్రశ్నించారు. ఆస్తులు కాపాడుకోవడనికి పార్టీలు మారుతున్నారన్నడం హాస్యాస్పదమన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని అవమానిస్తోందని, రాజ్యాంగహత్యా దివన్‌ నిర్వహిస్తామనడం ఎంత వరకు సమంజసమన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి చర్యలు తీసుకోవాలని హితవు పలికారు.

ఫ మొక్కలునాటడం సామాజిక బాధ్యత

భగత్‌నగర్‌/గణేష్‌నగర్‌: మొక్కలునాటడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సోమవారం శాతవాహన యూనివర్సిటీ ప్రాంగణంలో వనమహోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఆరు మొక్కలు అందిస్తారని, వాటిని నాటి సంరక్షించాలన్నారు. గ్రామాల్లో అవసరమైన పూలు, పండ్ల మొక్కలు అందిస్తారన్నారు. ప్రజల సహకారంతోనే మొక్కల సంరక్షణ సాధ్యమవుతుందన్నారు. తి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో యూనివర్సిటీకి శంకుస్థాపన చేశామని, అప్పుడు తాను మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌గా ఉన్నానన్నారు. 200 ఎకరాలను యూనివర్సిటీకి కేటాయించామని తెలిపారు. జిల్లాలో 43 లక్షల మొక్కల పెంచాలని ప్రభుత్వం లక్ష్యం విధించిందన్నారు. ప్రతి మొక్కకు అధికారులు జియో ట్యాగింగ్‌ చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ప్రపుల్‌ దేశాయ్‌, డీఎఫ్‌వో బాలమణి, డీఆర్డీవో శ్రీధర్‌, ఆర్డీవో మహేశ్వర్‌, తహసీల్దార్‌ రాజేశ్‌, ఎంపీడీవో ప్రభు పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2024 | 11:59 PM

Advertising
Advertising
<