ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పోలీస్‌ కుటుంబాలకు అండగా ఉంటాం

ABN, Publish Date - Apr 28 , 2024 | 12:08 AM

పోలీస్‌ కుటుంబాలకు అండగా ఉంటామని, వారి సంక్షే మం కోసం కృషి చేస్తామని రామగుండం సీపీ శ్రీనివాస్‌ అన్నారు.

కోల్‌సిటీ, ఏప్రిల్‌ 27: పోలీస్‌ కుటుంబాలకు అండగా ఉంటామని, వారి సంక్షే మం కోసం కృషి చేస్తామని రామగుండం సీపీ శ్రీనివాస్‌ అన్నారు. రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌లో ఆర్మ్‌డ్‌ విభాగంలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న మల్ల య్య కెనాల్‌లో మునిగి మృతిచెందగా, ఆయన కుటుంబానికి భద్రత ఎక్స్‌గ్రేషియా క్రింద రూ.8లక్షలను ఆయన భార్య హేమలత, కుమార్తె శ్రీజలకు, గోదావరిఖని టుటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ గుండె పోటుతో మరణించిన హెడ్‌ కానిస్టేబుల్‌ సోమరాజు భార్య శోభరాణికి, కుమార్తె సాయి ప్రియకు రూ.15.99 లక్షలను శనివారం సీపీ కార్యాలయంలో చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్‌ కుటుంబాలకు పోలీస్‌శాఖ ఎప్పటికీ అండగా ఉం టుందని, ప్రభుత్వపరంగా అందాల్సిన ఇతర బెనిఫిట్స్‌ను తక్షణమే అందజేస్తామని పేర్కొన్నారు. పోలీస్‌ సిబ్బంది, కుటుంబాల సంక్షేమంపై ప్రత్యేక చర్యలు తీసుకుని వారి అండగా ఉంటామన్నారు. మృతిచెందిన హెడ్‌కానిస్టేబుళ్ల కుటుంబాల స్థితి గతులను అడిగితెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ(అడ్మిన్‌) రాజు, ఏఆర్‌ ఏసీపీలు ప్రతాప్‌, సురేందర్‌, ఏవో అశోక్‌కుమార్‌, సూపరింటెండెంట్‌ సంధ్య ఉన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 12:09 AM

Advertising
Advertising