ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తెగిపోతున్న ‘పోగు’ బంధం

ABN, Publish Date - Aug 07 , 2024 | 01:44 AM

జిల్లాలో వ్యవసాయం తరువాత చేనేత రంగం ప్రధానంగా ఉండేది. తాము బతకడంతోపాటు మరో పది మందికి ఉపాధి కల్పించిన చేనేత కార్మికులు కాలక్రమేనా సంభవిస్తున్న మార్పులతో కుల వృత్తిని వదిలి ఇతర వృత్తులు, చిరు వ్యాపారాల్లోకి వెళ్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్తున్న వారూ ఉన్నారు.

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

జిల్లాలో వ్యవసాయం తరువాత చేనేత రంగం ప్రధానంగా ఉండేది. తాము బతకడంతోపాటు మరో పది మందికి ఉపాధి కల్పించిన చేనేత కార్మికులు కాలక్రమేనా సంభవిస్తున్న మార్పులతో కుల వృత్తిని వదిలి ఇతర వృత్తులు, చిరు వ్యాపారాల్లోకి వెళ్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్తున్న వారూ ఉన్నారు. జిల్లాలో చేనేత మగ్గం వృద్ధులకే పరిమితమవగా యువకులు మరమగ్గాలవైపు మళ్లారు. మరమగ్గాల వైపు వెళ్లిన యువకులు కూడా ఉపాధి లేక తల్లడిల్లుతున్న సంఘటనలే ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం చేనేత కార్మికులకు చేయూతను ఇచ్చే దిశగా పథకాలను ప్రవేశ పెడుతున్నా నేత కార్మికులకు అందని పరిస్థితి. సిరిసిల్ల జిల్లాలో ఒక నాడు చేనేత మగ్గాలతో కళకళలాడిన ప్రాంతాలు ఇప్పుడు ఆనవాళ్లనే కోల్పోయాయి. సిరిసిల్లలో మెట్‌పల్లి ఖాదీగ్రామోద్యో ప్రతిష్టతోపాటు కొన్ని సహకార సంఘాలు కార్మికులకు కొంత చేయూతను, ఉపాధిని కల్పిస్తున్నాయి. చేనేత కార్మికుడికి పదిహేను రోజులపాటు కష్టపడితే రూ.500 నుంచి రూ.800 వరకే కూలి లభిస్తోంది. చేనేత మగ్గాలకు కండెలు చుట్టే వృద్ధ మహిళలు ఒక నూలు లడి చుడితే రూ.6 నుంచి 10 రూపాయలు మాత్రమే లభిస్తాయి. పొద్దంతా చుడితే 50 రూపాయలు మాత్రమే గిట్టుబాటు అవుతుంది. చీరలోని గొప్పతనాన్ని చాటుతూ అగ్గిపెట్టెలో సైతం అమిరే చీర, కుట్టులేని దుస్తులు, మగ్గంపై మనుషుల చిత్రాలను నేసి ప్రపంచాన్ని అబ్బుర పరిచిన సిరిసిల్ల చేనేత పరిశ్రమ ఉనికిని మాత్రం కొందరు యువకులు బతికించే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని యెల్ది హరిప్రసాద్‌, నల్ల విజయ్‌ చేనేత, మరమగ్గాలపై వినూత్నంగా వస్త్రాలను తయారు చేస్తున్నారు. హరిప్రసాద్‌ తయారు చేసిన వస్త్రాలు, జీ20 లోగోతో ప్రధానమంత్రి మన్‌కీబాత్‌తో ప్రస్తావించడం, మూడోసారి చేపట్టిన ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆహ్వానం అందింది. ఇటీవల ఆంధ్రా డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు ఒక అభిమాని ద్వారా డ్రెస్స్‌ల కోసం ఆర్డర్లు వచ్చాయి. హరిప్రసాద్‌, నల్ల విజయ్‌ చేనేత రంగంలో చేసిన కృషికి అనేక అవార్డులను అందుకున్నారు.

లయ తప్పిన చేనేత మగ్గాలు

జిల్లాలో చేనేత మగ్గాలు లయ తప్పాయి. వేల సంఖ్యలో ఉన్న మగ్గాలు ఇప్పుడు వందల సంఖ్యలో చేరాయి. కార్మికులు మరమగ్గాల వైపు మారడంతో వేలల్లో ఉన్న చేనేత మగ్గాలు వందల సంఖ్యకు చేరాయి. వాటి స్థానంలో జిల్లా కేంద్రంలో 35 వేల మరమగ్గాలపై బట్ట ఉత్పత్తి జరుగుతోంది. దీంతో చేనేత మగ్గాలతో పోగు బంధం తెగిపోతోంది. చేనేత సహకార సొసైటీలు మూలనపడ్డాయి. ప్రస్తుతం జిల్లాలో రికార్డుల ప్రకారం 13 ఉన్నాయి. అందులో ఆరు సొసైటీలు మాత్రమే పనిచేస్తున్నాయి. చేనేత మగ్గాల స్థానంలో మరమగ్గాలు చేరాయి. జిల్లా కేంద్రంలో 35 వేల మరమగ్గాలపై బట్ట ఉత్పత్తి అవుతోంది. 1984లో సిరిసిల్ల జిల్లాలో చేనేత మగ్గాలు ఆరు వేల వరకు ఉండగా ఇప్పడు 204 మగ్గాలకు చేరుకున్నాయి. ఈ మగ్గాలపై 325 మంది కార్మికులు మాత్రమే ఉపాధి పొందుతున్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం చేనేత మిత్ర పథకాలను అందిస్తున్నారు. నూలు సబ్సిడీని ఇస్తున్నారు. ఈ పథకం ద్వారా 384 మంది కార్మికులకు రూ 4.21 లక్షలు విడుదల చేశారు. రూ లక్ష వరకు రుణమాఫీ చేశారు. చేనేత కళను బతికించడానికి కార్మికులకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం 2017లో చేనేత లక్ష్మి పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివిధ శాఖల ఉద్యోగులు 2662 మంది పథకంలో చేరారు. చేనేత లక్షీ పధకంలో చేరిన ఉద్యోగులు బట్టలు కొనుగోలు చేశారు. ఈ పథకం మళ్లీ కొనసాగలేదు. వేములవాడ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం చేనేత క్లస్టర్‌గా గుర్తించింది. క్లస్టర్‌ కింద రూ.1.19 కోట్ల నిధులను మంజూరు చేసింది. దీనిలో భాగంగా రూ.50 లక్షలతో మౌలిక వసతుల కేంద్రం ఆఽఽధునిక డిజైనతో కార్మికులకు శిక్షణ కార్యక్రమాలను చేపట్టింది. మొదటి విడతలో రూ.19.10 లక్షలు విడుదల చేయగా 300మంది లబ్ధిదారులు కొత్త డిజైన్ల అభివృద్ధి, చేనేత శిక్షణను పొందారు. జిల్లాలో ప్రతీ సంవత్సరం రూ.1.50 కోట్ల చేనేత వస్త్రాలు ఉత్పత్తి అవుతున్నాయి. జిల్లాలో 175 చేనేత మగ్గాలు ఉండగా అందులో కొన్ని వినియోగంలో లేవు. చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్‌ చేశారు. జిల్లాలో సిరిసిల్లలో 76 మగ్గాలు, వేములవాడలో 4, వేములవాడ మండలంలో 7, చందుర్తి 8, బోయినపల్లి 27, తంగళ్లపల్లి 34, ఇల్లంతకుంట 4, గంభీరావుపేట 1, కోనరావుపేటలో 14 ఉన్నాయి. ఇందులో సిరిసిల్లలో మహేశ్వర సొసైటీ, సిరిసిల్ల సొసైటీ, జగదాంబ సొసైటీ, వేములవాడ, హన్మాజీపేట, మామిడిపెల్లి సొసైటీలతో పాటు ఖాదీగ్రామోద్యోగు, తంగళ్లపల్లి సొసైటీల్లో చేనేత మగ్గాలు కార్మికులకు ఉపాధిని అందిస్తున్నాయి.

ప్రచారానికి నోచుకోని చేనేత ముద్ర

పవర్‌లూం, మిల్లు పోటీని తట్టుకోవడంలో చేనేత కార్మికులు పడుతున్న ఇబ్బందులను గమనించిన కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రాలకు గుర్తింపు కోసం ప్రత్యేక మార్క్‌ను తయారు చేసింది. చేనేత వస్త్రాలపై ముద్రను వేయాలని నిర్ణయించారు. చేనేత చీరలు బట్టలుగా నిర్ధారించుకోవడానికి ఈ మార్క్‌ ఉపయోగపడుతుందని భావించారు. కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం ప్రవేశ పెట్టిన ఈ చేనేత ముద్ర నిర్లక్ష్యంతో ప్రచారంలోకి రాలేదు. మరమగ్గాలపై తయారైన వస్త్రాలను చేనేత వస్త్రాలుగా అమ్మకాలు జరుపుతున్నా పట్టించుకోవడం లేదు.

త్వరలో చేనేత సంఘాల ఎన్నికలు

చేనేత మగ్గమే లోకంగా భావిస్తున్నా చేనేత సంఘాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఆరేళ్ల తరువాత మళ్లీ కసరత్తు మొదలు పెట్టింది. చేనేత జౌళి శాఖ అధికారులకు శిక్షణ ఇవ్వడంతో ఈ సారి ఎన్నికలు జరగుతాయనే భావిస్తున్నారు. చేనేత దినోత్సవాన్ని ఆర్భాటంగా జరుపుతున్న చేనేత సంఘాల ఎన్నికలపై చూపుతున్న ప్రభుత్వ తీరును కార్మికులు నిరసిస్తూనే ఉన్నారు. కార్మికుల విమర్శల మధ్య ఎట్టకేలకు ఎన్నికల నిర్వహణకు ముందుకు వచ్చినా కార్మికులు మాత్రం అయోమయంగానే ఉన్నారు. పాలకవర్గాల గడువు ముగిసి ఆరేళ్లు దాటినా తరువాత వచ్చే నెలలో ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న అన్ని సహకార సంఘాల కార్యవర్గాలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర సహకార సంఘాల ఎన్నికల అథారిటీ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు చేనేత జౌళి శాఖ సభ్యుల జాబితాలను సిద్ధం చేస్తోంది. ఐదేళ్లకోసారి నిర్వహించాల్సిన చేనేత సహకార సంఘాల ఎన్నికలు 2013లో చివరి సారిగా చేపట్టారు. వారి పదవీ కాలం 2018 ఫిబ్రవరితో ముగిసింది. ఆ సమయంలోనే ఎన్నికలు నిర్వహించాలని 40 రోజుల ముందే నోటిఫికేషన్‌ జారీ చేసే విధంగా చేనేత కార్మికులతో ఓటు హక్కు అర్హత కలిగిన జాబితాను జౌళిశాఖ అఽధికారులు ప్రభుత్వానికి నివేదించారు. మరోసారి ఎన్నికల నిర్వహణకు జాబితాలు సిద్ధం చేస్తున్నారు.

సిరిసిల్లలో చేనేత విగ్రహం

సిరిసిల్ల అనగానే మొదట గుర్తుకు వచ్చేది చేనేత, పవర్‌లూం కార్మికులు. వస్త్ర సంక్షోభంతో ఎప్పుడూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎదుట సిరిసిల్ల సమస్యలతో ముందు ఉంటుంది. సిరిసిల్లలో చేనేత మగ్గాలతోపాటు 35 వేల మరమగ్గాలు, అనుబంధ పరిశ్రమలు ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా సిరిసిల్ల పాత బస్టాండ్‌లో 2010లో భారీ చేనేత కార్మికుడి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

Updated Date - Aug 07 , 2024 | 01:44 AM

Advertising
Advertising
<