ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సీఎంఆర్‌ లక్ష్యాన్ని పూర్తి చేయాలి

ABN, Publish Date - Apr 09 , 2024 | 12:13 AM

నిర్దేశించిన లక్ష్యం మేరకు వానకాలం కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ను మిల్లర్లు వెంటనే పూర్తిచేయాలని కలెక్టర్‌ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన రైస్‌మిల్లర్లు, ఎఫ్‌సీఐ అధికారులతో సమన్వయ సమావేశానికి కలెక్టర్‌ అధ్యక్షత వహించారు.

కరీంనగర్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిర్దేశించిన లక్ష్యం మేరకు వానకాలం కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ను మిల్లర్లు వెంటనే పూర్తిచేయాలని కలెక్టర్‌ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన రైస్‌మిల్లర్లు, ఎఫ్‌సీఐ అధికారులతో సమన్వయ సమావేశానికి కలెక్టర్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైస్‌ మిల్లర్లు నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్దేశించిన లక్ష్యం మేరకు సీఎంఆర్‌ను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీ పడవద్దన్నారు. గోనె సంచులతో కాప్రా పురుగు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పురుగు సోకకుండా సర్వీస్‌ ప్రొవైడర్‌ సూచనలను పాటించాలని మిల్లర్లకు తెలిపారు. చనిపోయిన కాప్రా కలిగిన బియ్యం బస్తాలను తీసుకునేందుకు అనుమతిస్తామని ఎఫ్‌సీఐ జీఎం తెలిపారు. సీఎంఆర్‌పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రెండురోజులకోసారి సమీక్ష నిర్వహిస్తున్నారని, దీనిపై ప్రత్యేక దృష్టిసారించాలని అన్నారు. జమ్మికుంట ప్రాంత బియ్యాన్ని నిల్వ చేసేందుకు హసన్‌పర్తిలో గోదాం ఏర్పాటు చేయాలని సూచించారు. ఎఫ్‌సీఐ ఏరియా మేనేజర్‌ విశాల్‌ గుప్తా మాట్లాడుతూ రైస్‌మిల్లర్ల సమస్యలు పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ లక్ష్మికిరణ్‌, ఎఫ్‌సీఐ మేనేజర్‌ రాజేంద్రప్రసాద్‌, డిసి ఎస్‌వో గౌరిశంకర్‌, సివిల్‌ సప్లయిస్‌ డిఎం రజనీకాంత్‌, ఎఫ్‌సీఎస్‌వో సురేశ్‌, రైసు మిల్లర్ల సంఘం ప్రతినిధులు బోయినపల్లి ప్రభాకర్‌రావు, సుధాకర్‌రావు, కరుణాకర్‌ పాల్గొన్నారు.

ఫ ఉజ్వల పార్కును ఆకట్టుకునేలా తీర్చిదిద్దండి

కరీంనగర్‌ టౌన్‌: పర్యాటకులను ఆకట్టుకునేలా ఉజ్వల పార్కును తీర్చిదిద్దాలని కలెక్టర్‌ పమేలాసత్పతి పర్యాటకశాఖ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. సోమవారం ఆమె ఉజ్వల పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అన్ని రకాల మొక్కలను పెంచాలని అన్నారు. వాటర్‌ షూట్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం పార్కులోని జగన్నాథస్వామి ఆలయాన్ని కలెక్టర్‌ సందర్శించి పూజలు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ప్రపుల్‌దేశాయ్‌, పర్యాటకశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ఫ తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూడాలి

కరీంనగర్‌లో తాగునీటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక దృష్టిసారించి అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని కలెక్టర్‌ పమేలా సత్పతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం నగరంలోని ఎల్‌ఎండీ సమీపంలోని తాగునీటి పంపింగ్‌ వ్యవస్థ, కొత్తగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పనులను కలెక్టర్‌ పరిశీలించారు. తాగునీటి సరఫరాకు సంబంధించిన వివరాలను మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అదనంగా ఒక విద్యుత్‌ మోటార్‌ను, ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసి తాగునీటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, మున్సిపల్‌ ఈఈ బి మహేందర్‌, డీఈ లచ్చిరెడ్డి, ఏఈ గట్టుస్వామి పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2024 | 12:14 AM

Advertising
Advertising