ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతం

ABN, Publish Date - Jun 16 , 2024 | 12:47 AM

అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతంపై ప్రభుత్వం దృష్టి సారించింది. రిటైర్‌మెంట్‌తోపాటు ఇతర బెనిఫిట్స్‌ కల్పించాలనే డిమాండ్‌తో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు ఎంతో కాలంగా ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం 65 ఏళ్లు నిండిన వారికి రిటైర్‌మెంట్‌ అవకాశం కల్పించే విషయంపై దృష్టి సారించింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల ఉద్యోగ విరమణ ప్రక్రియ ముందుకు వచ్చినా లోక్‌సభ ఎన్నికల కోడ్‌తో వాయిదా పడింది. ఎన్నికల కోడ్‌ ముగియడంతోనే మరోసారి అంగన్‌వాడీల ప్రక్షాళన మొదలైంది.

జిల్లాలో 122 మందికి ఉద్యోగ విరమణ

దశాబ్దాల కాలంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో వయోభారంతో పనిచేస్తున్న టీచర్లు, ఆయాల్లో 65 సంవత్సరాలు దాటిన వారికి ఉద్యోగ విరమణ అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జిల్లాల వారీగా వివరాలను సేకరించింది. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 122 మంది ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఏప్రిల్‌ 30 వరకు ప్రభుత్వానికి అందించిన నివేదిక ప్రకారం సిరిసిల్ల ప్రాజెక్ట్‌ పరిధిలో 89 మంది ఉద్యోగ విరమణ పొందనున్నారు. వీరిలో టీచర్లు 25 మంది, హెల్పర్లు 64 మంది ఉన్నారు. వేములవాడ ప్రాజెక్ట్‌ పరిధిలో 33 మంది ఉద్యోగ విరమణ పొందనున్నారు. వీరిలో ఇద్దరు టీచర్లు, 31 మంది హెల్పర్లు ఉన్నారు. ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేసి అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయనున్నారు. ఇప్పటికే మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చారు. 65 ఏళ్ల పైబడిన వారిని లెక్కించడంలో ఆయాలకు విద్యార్హత లేకపోవడంతో కొంత మేరకు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.

అంగన్‌వాడీ టీచర్లపై చిన్నచూపే

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సేవలు అందిస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు చాలీచాలనీ గౌరవ వేతనం తీసుకుంటున్నారు. ఏళ్ల తరబడి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ పనిచేస్తున్నారు. చిన్న భత్యంతో పెద్ద బాధ్యతలను నిర్వహిస్తున్న వీరికి తాజాగా రిటైర్‌మెంట్‌ బెన్‌ఫిట్స్‌పై కూడా ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందనే విమర్శలు ఉన్నాయి. రిటైర్‌మెంట్‌ బెన్‌ఫిట్స్‌లో అంగన్‌వాడీ టీచర్లకు రూ .లక్ష, ఆయాలకు రూ.50 వేలు చెల్లిస్తామని ప్రకటించారు. ఇదీ చాలా చిన్న మొత్తమని సంఘాలు భావిస్తున్నాయి. అంగన్‌వాడీ టీచర్లకు రూ.5 లక్షలు, ఆయాలకు రూ.3 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అంగన్‌వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతోపాటు కనీస వేతనం రూ. 26 వేలు, పెన్షన్‌, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత, గ్రాట్యూటీ, హెల్త్‌ కార్డులు, వేసవిలో ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా సెలవులు, పక్కా భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలనే డిమాండ్‌లు ఉన్నాయి.

40 వేల మంది లబ్ధిదారులు

జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ రెండు ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌లు ఉండగా 587 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా 40 వేల మందికిపైగా లబ్ధిదారులకు పౌష్టికాహారం, ఇతర సేవులు అందిస్తున్నారు. జిల్లాలో పోషకాహార లోపం తొలగించే దిశగా ఎదిగే పిల్లలు మహిళలకు అరోగ్య లక్ష్మీ ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం భోజనంతోపాటు కోడిగుడ్లు, పాలు అందిస్తున్నారు. చిన్నారులకు ఫ్రీ స్కూల్‌ విద్యను బోధిస్తున్నారు. జిల్లాలో పోషణ్‌ ట్రాకర్‌ ద్వారా 17,138 మంది పిల్లలకు బాలామృతం, టేక్‌ హోం రేషన్‌ ద్వారా 16 కోడిగుడ్లు అందిస్తున్నారు. దీంతో పాటు 4133 మంది గర్భిణులు, 2644 మంది బాలింతలు, 3 నుంచి 6 సంవత్సరాలు 15,195 మందికి ఒక పూట సంపూర్ణభోజనం, ప్రతీ రోజు కోడి గుడ్డు, పాలు, పప్పు, కూరగాయలు, స్నాక్స్‌ అందించడంలో కీలకంగా పని చేస్తున్నారు.

అద్దె భవనాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు

జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ రెండు ప్రాజెక్ట్‌ల పరిధిలో 587 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నా అద్దె భవనాల్లో అనేక ఇబ్బందుల మధ్య నిర్వహణ కొనసాగుతోంది. 587 కేంద్రాల్లో 257 కేంద్రాలకు సొంత భవనాలు ఉండగా 158 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. 172 కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల్లోని గదుల్లో నిర్వహిస్తున్నారు. సిరిసిల్ల ప్రాజెక్ట్‌ పరిధిలో 362 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా 135 సొంత భవనాల్లో కొనసాగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాల గదుల్లో 121 కేంద్రాలు ఉండగా 106 కేంద్రాల్లో అద్దె భవనాల్లో ఉన్నాయి. వేములవాడ ప్రాజెక్ట్‌ పరిఽధిలో 225 కేంద్రాలు ఉండగా సొంత భవనాల్లో 122 కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాల గదుల్లో 51 కేంద్రాలు, అద్దె భవనాల్లో 52 కేంద్రాలు ఉన్నాయి. సొంత భవనాల్లోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సొంత భవనాల నిర్మాణాలు కొన్ని చోట్ల మొదలైనా వివిధ కారణాలతో పనులు నిలిచిపోయాయి. ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలపై దృష్టి పెట్టడంతో ఉన్నతీకరణకు అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు.

Updated Date - Jun 16 , 2024 | 12:47 AM

Advertising
Advertising