ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పేద విద్యార్థుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి

ABN, Publish Date - Jul 08 , 2024 | 12:42 AM

పేద విద్యా ర్థుల విద్యాభివృద్ధికి, వారి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు.

కోల్‌సిటీటౌన్‌, జూలై 7: పేద విద్యా ర్థుల విద్యాభివృద్ధికి, వారి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. ఆదివారం రామగుండం కార్పొరేషన్‌లోని 48వ డివిజన్‌లో పాత మున్సిపల్‌ కార్యాలయం సమీపంలో ఎన్‌టీపీసీ సీఎస్‌ఆర్‌ నిధులు రూ.2 కోట్లతో సాంఘీక సంక్షేమ వసతి గృహ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాభవన నిర్మాణ పనుల విషయంలో ఎక్కడ రాజీ పడకుండా నాణ్యత ప్రమాణాలతో నిర్మాణాన్ని పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌, సంబం ఽధిత అధికారులకు సూచించారు. కమి షన్లకు ఆశపడి నాసిరక నిర్మాణ పనులు చేపడితే తప్పకుండా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అవినీతికి చోటు లేదని, ప్రతిఒక్కరూ అంకిత భావంతో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ బంగి అనిల్‌కుమార్‌, కార్పొరేటర్లు లక్ష్మణ్‌గౌడ్‌, మహాంకాళిస్వామి, ముస్తఫా, కాంగ్రెస్‌ నాయకులు సతీష్‌, శివ, మోబిన్‌ తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2024 | 12:43 AM

Advertising
Advertising
<