ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నామినేషన్ల పరిశీలన పూర్తి

ABN, Publish Date - Apr 26 , 2024 | 11:48 PM

కరీంనగర్‌పార్లమెంట్‌ ఎన్నికల అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాలులో అభ్యర్థులు, వారి తరపున హాజరైన ప్రజాప్రతినిధుల సమక్షంలో కరీంనగర్‌ పార్లమెంట్‌ ఎన్నికల సాధారణ పరిశీలకులు ఐఎఎస్‌ అదికారి అమిత్‌కటారియా పర్యవేక్షణలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి నామినేషన్‌ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

కరీంనగర్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరీంనగర్‌పార్లమెంట్‌ ఎన్నికల అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాలులో అభ్యర్థులు, వారి తరపున హాజరైన ప్రజాప్రతినిధుల సమక్షంలో కరీంనగర్‌ పార్లమెంట్‌ ఎన్నికల సాధారణ పరిశీలకులు ఐఎఎస్‌ అదికారి అమిత్‌కటారియా పర్యవేక్షణలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి నామినేషన్‌ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానానికి 53 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 94 నామినేషన్లను పరిశీలించారు. లోపాలున్న, సరిగా వివరాలు సమర్పించని 20 మంది నామినేషన్లను తిరస్కరించినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. 33 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించినట్లు తెలిపారు. తిరస్కరణఖు గురైన అభ్యర్థుల సెక్యురిటి డిపాజిట్‌ను తిరిగి ఇస్తామని, నామినేషన్‌ ఎందుకు తిరస్కరణకు గురైందో వివరాలు అభ్యర్థులకు తెలియజేస్తామన్నారు.

ఫ 29వ తేదీ 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు

కరీంనగర్‌ పార్లమెంట్‌స్థానానికి నామినేషన్ల ఉపసంహరణకు 29వ తేదీ 3 గంటల వరకు అవకాశం ఉందని ఎన్నికల అధికారి పమేలా సత్పతి తెలిపారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు శని, ఆదివారాలు సెలవులు ఉంటాయన్నారు. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల్లోగా నామినేషన్లను అభ్యర్థులు ఉపసంహరించుకోవచ్చన్నారు. సెలవు రోజుల్లో ఉపసంహరణకు అవకాశం ఉండదని, అభ్యర్థులు గమనించాలన్నారు. 29వ తేదీ మూడు గంటలవరకు మాత్రమే అవకాశం ఉంటుందని సమయం తర్వాత వచ్చి ఇబ్బందులు పడవద్దని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ప్రపుల్‌ దేశాయ్‌, లక్ష్మీకిరణ్‌, రాజన్న సిరిసిల్ల అదనపు కలెక్టర్‌ పూజారి గౌతమి, ట్రైని కలెక్టర్‌ అజయ్‌యాదవ్‌, ఆర్డీవోలు మహేశ్వర్‌, రమేష్‌బాబు, అధికారులు, అభ్యర్థులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 11:48 PM

Advertising
Advertising