ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజాపాలన సేవా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ABN, Publish Date - Jul 21 , 2024 | 12:16 AM

ప్రజలకు సేవలు అందించేందుకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ఝా కోరారు.

కలెక్టరేట్‌లో ప్రజాపాలన సేవా కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌

సిరిసిల్ల కలెక్టరేట్‌, జూలై 20 : ప్రజలకు సేవలు అందించేందుకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ఝా కోరారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాన్ని శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్‌ పట్టణాలతోపాటు అన్ని మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజా పాలన సేవా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అర్జీలు సమర్పించేందుకు నిత్యం కలెక్టరేట్‌కు వచ్చే వారికి సైతం ప్రజాపాలన సేవా కేంద్రం అందుబాటులో ఉండాలని భావించి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరుగ్యారంటీల్లోని వంట గ్యాస్‌ సిలిండర్‌రాయితీ, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ తదితర పథకాలను అర్హులైన ప్రతీ కుటుంబానికి అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పలు కారణాలతో ఉచిత విద్యుత్‌, గ్యాస్‌సిలిండర్‌ సబ్సిడీ పొందలేక పోతున్న అర్హులు ప్రజాపాలన సేవా కేంద్రాలను సందర్శించాలని, లోటుపాట్లు ఉంటే సరిచేయించుకోవాలని సూచించారు. కలెక్టరేట్‌లోని సేవా కేంద్రం ప్రభుత్వ కార్యాలయాల పని దినాల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, విద్యుత్‌ సర్వీస్‌కనెక్షన్‌ నంబరు, గ్యాస్‌ కనెక్షన్‌ నంబరు, ఎల్‌పీజీ కస్టమర్‌ ఐడీ, సెల్‌ ఫోన్‌ నంబర్లను వెంట తెచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఅర్‌వో వంగరి శ్రీధర్‌, ఈ జిల్లా మేనేజర్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 21 , 2024 | 12:16 AM

Advertising
Advertising
<