కరీంనగర్-హసన్‌పర్తి రైల్వే లైన్‌కు అనుమతులు ఇవ్వండి
ABN, Publish Date - Sep 10 , 2024 | 11:53 PM
కరీంనగనర్-హసన్‌పర్తి రైల్వే లైన్‌కు నిర్మాణ అనుమతులు ఇవ్వాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ కోరారు. మంగళవారం ఢిల్లీలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి లేఖను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్-హసన్‌పర్తి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమైనందున నిర్మాణ పనులకు అనుమతి ఇవ్వాలన్నారు.
భగత్‌నగర్, సెప్టెంబరు 10: కరీంనగనర్-హసన్‌పర్తి రైల్వే లైన్‌కు నిర్మాణ అనుమతులు ఇవ్వాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ కోరారు. మంగళవారం ఢిల్లీలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి లేఖను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్-హసన్‌పర్తి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమైనందున నిర్మాణ పనులకు అనుమతి ఇవ్వాలన్నారు. కరీంనగర్ నుంచి హసన్‌పర్తి వరకు 61.8 కిలోమీటర్ల మేర నిర్మించే రైల్వే లైన్‌కు 1,415 కోట్ల వ్యయం అవుతుందన్నారు. రైల్వే బోర్డులో ఈ అంశం పెండింగ్‌లో ఉందని, తక్షణమే ఆమోదం తెలపాలని కోరారు. కొత్త రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే కరీంనగర్ పార్లమెంట్ నియోజక వర్గ ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుందన్నారు. కరీంనగర్-వరంగల్ మధ్య వాణిజ్య సంబంధాలు పెరిగి ఆర్థిక వృద్ధికి తోడ్పతుందన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఉప్పల్ రైల్వే స్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేయాలన్నారు. జమ్మికుంట స్టేషన్ వద్ద దక్షిణ ఎక్స్‌ప్రెస్ రైలు ఆపాలని అధికారులను ఆదేశించాలని మరో లేఖ అందజేశారు. ఉప్పల్ రైల్వే స్టేషన్ అప్‌గ్రేడ్‌లో భాగంగా ఫ్లాట్‌ఫాం రైల్వేస్టేషన్ భవనాన్ని ఆధునీకరించాలన్నారు. పార్కింగ్‌ను విస్తరించాలని, సోలార్ ప్యానెళ్లను అమర్చాలని, టికెట్ కౌంటర్ లగేజీ నిర్వహణ వ్యవస్థను మెరుగు పరచాలన్నారు.
Updated Date - Sep 10 , 2024 | 11:53 PM