ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే రాజకీయాలకు స్వస్తి

ABN, Publish Date - Sep 06 , 2024 | 11:44 PM

పోలీసుశా ఖలో పోస్టింగ్‌ల పేరిట తాను డబ్బులు తీసుకు న్నట్టు నిరూ పిస్తే రాజకీయాలను నుంచి వైదొలు గుతానని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్య క్షుడు, మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రకటించారు. శుక్రవా రం స్థానిక రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ చేసిన ఆరోపణలను తీవ్రం గా ఖండించారు.

కరీంనగర్‌ అర్బన్‌, సెప్టెంబరు 6: పోలీసుశా ఖలో పోస్టింగ్‌ల పేరిట తాను డబ్బులు తీసుకు న్నట్టు నిరూ పిస్తే రాజకీయాలను నుంచి వైదొలు గుతానని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్య క్షుడు, మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రకటించారు. శుక్రవా రం స్థానిక రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ చేసిన ఆరోపణలను తీవ్రం గా ఖండించారు. సీఐ పోస్టింగ్‌ కోసం తాను 20 లక్షల రూపాయలు తీసుకున్నట్టుగా చేసిన ఆరో పణలను రుజువు చేయాలన్నారు. నిరూపించక పోతే ఇక ముందు తప్పుడు ఆరోపణలు చేయ కుండా ఉండాలని, లేకుంటే తగిన శాస్తి తప్పద ని ఆయన హెచ్చరించారు. ఓటమిని జీర్ణించుకో లేని బాలకిషన్‌ బట్టకాల్చి మీదేసే విధంగా తన పై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను పక్కదోవపట్టిస్తున్నారన్నారు. వరదల వేళ తాను హైదరాబాద్‌కే పరిమితమైనట్టుగా రసమయి సాగించిన ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌తో తనకు ఎలాంటి వైరం లేదన్నారు. కమిషనరేట్‌ పరిధిలో దళిత సీఐ పోస్టింగ్‌ల విషయంలో సీపీ వైఖరిని మాత్రం తప్పుపడుతున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు దళిత సామాజిక వర్గానికి చెందిన నలు గురు సీఐలను విధుల్లో చేర్చుకోకుండా సీపీ వెనక్కి పంపించారన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో రసమయి రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారి ని సీఐగా నియమించుకోగా, ఇప్పుడు తాను దళి త సామాజికవర్గానికి చెందిన సీఐలు ఉండాలని కోరుకోవడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి కల్లుతాగిన కోతిలా చిందులు వేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ వ్యవహారానికి ఫోన్‌ ట్యాంపిం గ్‌ను ముడిపెట్టడం విడ్డూరంగా ఉందని విమ ర్శించారు. సమావేశంలో బెజ్జంకి మార్కెట్‌ కమి టీ చైర్మన్‌ పులి కృష్ణ, బెజ్జంకి బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్‌, ఇల్లంతకుంట మాజీ ఎంపీపీ ఊట్కూరి రమణారెడ్డి, వివిధ మండలా ల కాంగ్రెస్‌ అధ్యక్షులు పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2024 | 11:44 PM

Advertising
Advertising