ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నులిపురుగుల నివారణకు చర్యలు

ABN, Publish Date - Jun 12 , 2024 | 12:43 AM

నులి పురుగుల నివార ణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, జూన్‌ 20న జిల్లాలో ఉన్న 1నుంచి 19 సంవత్సరాల వయసు లోపు పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మాత్రల ను పంపిణీ చేయాలని అదనపు కలెక్టర్‌ జే.అరుణశ్రీ సంబంధిత అధికారులు సూచించారు.

పెద్దపల్లిటౌన్‌, జూన్‌ 11: నులి పురుగుల నివార ణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, జూన్‌ 20న జిల్లాలో ఉన్న 1నుంచి 19 సంవత్సరాల వయసు లోపు పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మాత్రల ను పంపిణీ చేయాలని అదనపు కలెక్టర్‌ జే.అరుణశ్రీ సంబంధిత అధికారులు సూచించారు. మంగళవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ తన చాంబర్‌లో నులి పురుగుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబం ధిత అధికారులతో సమీక్షించారు. జే.అరుణశ్రీ మాట్లా డుతూ, నులి పురుగులు చాలా ప్రమాదకరమని, వీటి తో రక్తహీనతతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతా యని, వీటిని నివారిస్తే ఆరోగ్యంగా వుండవచ్చన్నారు. నులి పురుగుల నియంత్రణ కీలకమైన అంశమని, దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహ రించకుండా వారికి కేటాయించిన విధులను సమన్వయంతో కట్టుదిట్టంగా నిర్వహిం చాలని సూచించారు. జూన్‌ 20న జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, పైవ్రేట్‌ పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలలో నులిపు రుగుల నివారణ మందులను పంపిణీ చేయడం జరుగుతుందన్నా రు. జిల్లాలోని అంగన్‌వాడి కేంద్రాలు, ప్రభుత్వ, ఎయిడెడ్‌, పైవ్రేట్‌ పాఠశాలలో, జూనియర్‌ కళాశాలలో జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 2లక్షల 27వేల 251 మందికి అల్బెండజోల్‌ మాత్రలను పంపిణి చేయాలన్నారు. జిల్లాలో మొత్తం 2లక్షల 49వేల 976నులి పురుగుల నివారణ మాత్రలను అందుబాటులో ఉంచుకున్నామని, ఆశా వర్క ర్లు, అంగన్‌వాదీ టీచర్లు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఇతర సిబ్బంది కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. 20న అనారోగ్య, ఇతర కారణాల వల్ల మాత్రలు వేసుకోని విద్యార్థులకు తప్పనిసరిగా 27న అందించాలని సూచించారు. అనంతరం జాతీ య నులిపురుగుల నిర్మూలన దినంపై రూపొందించిన వాల్‌పోస్టర్ల ను అరుణశ్రీ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సమావేశం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ కే.ప్రమోద్‌ కుమార్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ కృపాబాయి, జిల్లా ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారి కల్పన, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, వెను కబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జే. రంగారెడ్డి, షెడ్యూల్‌ తరగతుల సంక్షేమ అధికారి నాగలైశ్వర్‌, మునిసిపల్‌ కమిషనర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2024 | 12:43 AM

Advertising
Advertising