రైతు సంక్షేమానికి పెద్దపీట
ABN, Publish Date - Aug 31 , 2024 | 12:29 AM
రైతు సంక్షేమానికి రాష్ట్రప్రభుత్వం పెద్దపీట వేస్తోందని డిసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మానకొండూర్ మార్కెట్ కమిటి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్రంలోని రైతులందరికీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. మండలంలో 8వేల మందికి రూ.55కోట్ల రుణమాఫీ అయినట్లు చెప్పారు. దీంతో రైతులు సంబరాలు చేసుకుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని అన్నారు.
మానకొండూర్, ఆగస్టు 30: రైతు సంక్షేమానికి రాష్ట్రప్రభుత్వం పెద్దపీట వేస్తోందని డిసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మానకొండూర్ మార్కెట్ కమిటి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్రంలోని రైతులందరికీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. మండలంలో 8వేల మందికి రూ.55కోట్ల రుణమాఫీ అయినట్లు చెప్పారు. దీంతో రైతులు సంబరాలు చేసుకుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని అన్నారు. సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయిన 1,800 మంది రైతులకు కచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్ అసత్య ఆరోపణలతో ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారానే అన్ని ప్రాజెక్టులకు నీరు అందనుందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మిడ్‌మానేరు, అంతగిరి, రంగనాయకసాగర్ ఎల్‌ఎండీలోకి నెల రోజులలోనే 20 టీఎంసీల నీరును సరఫరా చేశామని తెలిపారు. నూతన పాలకవర్గం రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన సూచించారు. అంతకు ముందు చెరువు కట్ట బస్టాండ్ నుంచి మార్కెట్ కార్యాలయం వరకు కార్యకర్తలు, రైతులు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పల్లెమీద బస్టాండ్ వద్ద క్రేన్ సా యంతో భారీ గజమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షుడు మర్రి ఓదెలు, ఉపాధ్యక్షుడు రామిడి తిరుమల్‌రెడ్డి, మార్కెటింగ్ శాఖ అఽధికారి ప్రకాష్, తహసీల్దార్ రాజేశ్వరి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నందగిరి రవీంద్రాచారి, డీసీ ప్రధాన కార్యదర్శి తాల్లపల్లి సంపత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
శంకరపట్నం: విద్యార్థులు ప్రాథమిక దశ నుంచే విద్యతో క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మండలంలోని కేశవపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 68వ ఎస్‌జీఎఫ్ మండల స్థాయి పాఠశాలల క్రీడోత్సవాలలో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యే జెండా ఆవిష్కరించి రప్రారంభిం చారు. కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణ ప్రసాద్, తహసీల్ధార్ భాస్కర్, మాజీ జడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు గోపగోని బసవయ్య, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Aug 31 , 2024 | 12:29 AM