ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సీతారాముల కల్యాణం చూతము రారండి..

ABN, Publish Date - Apr 17 , 2024 | 01:02 AM

సీతారాముల కల్యాలణానికి ఆలయాలు ముస్తాబయ్యాయి. బుధవారం శ్రీరామనవమి సందర్భంగా జిల్లాలో సీతారాముల కల్యాణ వేడుకలు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ప్రధానంగా వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో సీతారామచంద్రస్వామివారల దివ్య కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

సీతారాముల కల్యాలణానికి ఆలయాలు ముస్తాబయ్యాయి. బుధవారం శ్రీరామనవమి సందర్భంగా జిల్లాలో సీతారాముల కల్యాణ వేడుకలు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ప్రధానంగా వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో సీతారామచంద్రస్వామివారల దివ్య కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏటా శ్రీరామనవమి సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో భద్రాద్రిని తలపించే రీతిలో సీతారామచంద్రస్వామి కల్యాణ వేడుకలను కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంతోపాటు ఇల్లంతకుంట, సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్‌, వీర్నపల్లి, తంగళ్లపల్లి, బోయినపల్లి, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట, మండలాల్లోని హనుమాన్‌ దేవాలయాలతోపాటు వేంకటేశ్వర స్వామి, ఇతర దేవాలయాల్లో సీతారాముల కల్యాణం జరపడానికి ఏర్పాట్లు చేశారు. హనుమాన్‌ దీక్షాదారులు ముందు వరుసలో నిలిచి పనుల్లో నిమగ్నమయ్యారు. స్వామివారి కల్యాణం, పట్టాభిషేకం వంటి ఘట్టాలను నిర్వహించనున్నారు.

ముస్తామైన రాజన్న క్షేత్రం

వేములవాడ : జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో సీతారామచంద్రస్వామివారల దివ్య కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏటా శ్రీరామనవమి రోజున వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో భద్రాద్రిని తలపించే రీతిలో సీతారామచంద్రస్వామి కల్యాణ వేడుకలను కన్నుల పండువగా నిర్వహించడం ఆనవాయితీ. బుధవారం ఉదయం 11-59 గంటలకు సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. సీతారాముల కల్యాణం తిలకించడం కోసం వేలాది మంది భక్తులు రాజన్న క్షేత్రానికి తరలివస్తున్నారు. జానకీరాముల కల్యాణం సందర్భంగా శివుడిని మనువాడే ఆనవాయితీ ఉన్న వేలాది మంది శివపార్వతులతోపాటు భారీ సంఖ్యలో హిజ్రాలు వేములవాడ చేరుకున్నారు.

Updated Date - Apr 17 , 2024 | 01:02 AM

Advertising
Advertising